Samantha Marriage : ఇన్నాళ్లకు మళ్ళీ పెళ్లిబట్టల్లో సమంత.. కానీ మీరనుకున్నట్టు కాదు!

Samantha Marriage : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా లో మాత్రం మామూలుగా యాక్టీవ్ గా ఉండదు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో సమంత ఫాలోయింగే వేరు. సమంత తో పాటే ఎంట్రీ ఇచ్చిన చాలా మంది తమ స్టార్ డమ్ కోల్పోయినా, తన క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. అందుకే సమంత సినిమాలు ఎప్పుడొచ్చినా ఎగబడిపోతారు ఫ్యాన్స్. ఇక నాగ చైతన్య తో విడిపోయినా తన జ్ఞాపకాలను మాత్రం ఇంకా మర్చిపోలేదని చెప్పాలి. కానీ ఒక్కొక్కటిగా చెరిపేస్తూ ఉంది. ఇదిలా ఉండగా సమంత చాలా ఏళ్ళ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు తన పెళ్లి బట్టల్లో కనిపించి ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అసలు విషయం వేరే ఉంది. అది ఆడియన్స్ ఊహించినట్టు ముమ్మాటికీ కాదు. ఆ వెడ్డింగ్ డ్రెస్ గురించి సమంత షేర్ చేసిన ఫొటోలు, మ్యాటర్ వేరే విధంగా ఉంది.

పెళ్లి బట్టల్లో సామ్.. ట్రాన్స్ఫర్మేషన్ అదుర్స్..

ఇక సమంత (Samantha) తాజాగా గురువారం సాయంత్రం జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ’ అవార్డ్స్‌ ఈవెంట్ కి హాజరయింది. అక్కడ సమంత ఓ బ్లాక్ కలర్ లో పూసల రవిక గౌనులో కనిపించింది. దాని ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా? అది ఆమె పెళ్లి గౌను. ఇది చాలా మంది నమ్మరు. ఎందుకంటే తన పెళ్లి గౌను పూర్తిగా తెలుపయితే, ఇది నలుపు. కానీ ఇది నిజం. సమంత తన పెళ్లి డ్రెస్ ని తిరిగి తయారు రీ మోడలింగ్ చేసి తయారు చేయించింది. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ సమంత పెళ్లి బట్టల్ని మళ్ళీ ఎలా అప్డేట్ చేసారో వీడియోలో చూపించారు. క్రేషా బజాజ్ సమంతతో ఒక కొల్లాబ్ పోస్ట్‌ను పంచుకోగా, అందులో బట్టల గురించి ఇలా ప్రస్తావిస్తూ, “ఎప్పుడూ కొత్త జ్ఞాపకాలు ఉంటాయి. నడవడానికి ఎప్పుడూ కొత్త దారులు ఉంటాయి. చెప్పడానికి ఎప్పుడూ కొత్త కథలు ఉంటాయి. మా ముద్దుగుమ్మ సమంతతో కలిసి పనిచేయడం మాకు చాలా ఇష్టం, ఆమెకు కొత్త జ్ఞాపకాన్ని సృష్టించడానికి మరియు మరొక కథ చెప్పడంలో మాకు చాలా ఇష్టం. ఈ డ్రెస్ ఎప్పటికీ ఇది సమంత కోసం, అవార్డ్ షో కోసం ఒక కొత్త రూపం తీసుకోవచ్చు. అని సమంత ని మెన్షన్ చేయగా, 2017లో సమంత తన పెళ్లికి ధరించిన గౌను ఇదేనని సమంత ఫ్యాన్స్ గుర్తించారు.

పెళ్లిబట్టల్లో.. సామ్ కామెంట్స్ వైరల్..

ఇక సమంత నాగచైతన్య ఏమాయ చేసావే మొదలుకొని మజిలీ వరకు నాలుగు సినిమాల్లో కలిసి నటించగా, 2017 లో పెళ్లి చేసుకున్నారు. అయితే అక్టోబర్ 2021లో ఇద్దరూ ఒకేసారి విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇక తాజాగా తన వెడ్డింగ్ డ్రెస్ గురించి వివరాలను పంచుకుంటూ, సమంతా సోషల్ మీడియాలో స్పందించింది. “మేము ఇకపై నిలకడను విస్మరించలేము. అది ఎంపిక అయినప్పుడు, ఆ దశను దాటిపోయాము. నేను ధరించిన దుస్తులు ఈ రోజు అత్యంత ప్రతిభావంతులైన క్రేషా బజాజ్ ద్వారా తనకిష్టమైన గౌను ని మళ్ళీ డిజైన్ చేయించానని, ఇక నా అలవాట్లను మార్చుకోవడానికి మరియు నా జీవనశైలిని మరింత నిలకడగా మార్చడానికి నేను ప్రయత్నపూర్వకంగా అడుగులు వేస్తున్నానని, నేను మరియు మీ మనసుల్లో నా పట్ల సద్భావన కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ గురువారం రాత్రి పోస్ట్ చేయగా, పెట్టిన గంటల్లోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఇప్పటికి 5 లక్షల లైక్స్ తో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో సమంతకు ఎప్పటికి తమ సపోర్ట్ ఉంటుందని, అభిమానిస్తూనే ఉంటామని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు