Ram Charan: కెరీర్ మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యకు చెర్రీ ఫుల్ స్టాప్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ మొదటి నుంచి తనను పట్టిపీడిస్తున్న సమస్యను ఎట్టకేలకు వదిలించుకోవడానికి రెడీ అయ్యారు. ఇన్నేళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని చెర్రీ, ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. చెర్రీని ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏమిటంటే… సినిమా సినిమాకు మధ్య గ్యాప్. ఇండస్ట్రీలోని మిగతా హీరోల కన్నా చెర్రీనే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. మరి ఇంతకీ ఈ గ్యాప్ సమస్యకు చెర్రీ ఎలాంటి పరిష్కారం ఆలోచించాడు? అంటే…

కెరీర్ మొదటి నుంచే…
చిరుత మూవీతో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్లోకి చెర్రీ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత రాజమౌళితో మగధీర కన్ఫామ్ కావడంతో రెండేళ్లు భారీ గ్యాప్ ఇవ్వక తప్పలేదు చెర్రీకి. అయితే మగధీర మూవీ మంచి మూల్యాన్నే చెల్లించింది. ఈ మూవీతో అప్పటిదాకా చిరంజీవి తనయుడుగా నెట్టుకొస్తున్న రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలిగాడు. 2009లో మగధీర మూవీ రిలీజ్ కాగా, అప్పటి నుంచి 2019లో తెర మీదకు వచ్చిన వినయ విధేయ రామ మూవీ వరకు ఏడాదికి ఒక్క సినిమాను మాత్రమే చేశాడు చెర్రీ. 2011, 2017లో మాత్రం అది కూడా చేయలేకపోయాడు.

తర్వాత రాజమౌళి సెంటిమెంట్…
వినయ విధేయ రామ తర్వాత చెర్రీ ట్రిపుల్ ఆర్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగానే రాజమౌళి సినిమాలకు కమిట్ అయ్యే ముందు, అయిన తర్వాత హీరోలు ప్లాప్ అందుకుంటారని, చాలా గ్యాప్ వస్తుందనే టాక్ ఉండనే ఉంది. దానికి తగ్గట్టుగానే చెర్రీ వినయ విధేయ రామ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చవిచూసాడు. ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగినప్పటికీ, ఆ తర్వాత ఆచార్య మూవీతో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ మూవీకి ముందు మూడేళ్లు 2019 నుంచి 2021 దాకా, ఆ మూవీ రిలీజ్ అయ్యాక మరో రెండేళ్లు అంటే 2022 నుంచి 2024 దాకా భారీ గ్యాప్ వచ్చింది.

- Advertisement -

చెర్రీ సమస్యకు చెక్
దీంతో మెగా అభిమానుల్లో ఆకలి పెరిగిపోయింది. అందుకే ఈ సమస్యను వదిలించుకోవడానికి చెర్రీ అదిరిపోయే ప్లాన్ వేశాడు. 2025 లోపు మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. 2023లో రిలీజ్ కావాల్సిన గేమ్ చేంజర్ ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతోంది. మార్చ్ 20న రాంచరణ్ 16వ మూవీ లాంచ్ అయ్యింది. బుచ్చిబాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఆరు నెలల్లోనే ఈ మూవీని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత రామ్ చరణ్ 17వ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలను 2025 లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్. ఒకవేళ ఇదే గనక జరిగితే మెగా ఫ్యాన్స్ ఆకలి తీరేలా బ్యాక్ టు బ్యాక్ చెర్రీ మూవీస్ థియేటర్లలో సందడి చేయడం ఖాయం. అలాగే ఇన్నాళ్లూ చెర్రీని పట్టి వేధిస్తున్న ఆ గ్యాప్ సమస్య కూడా తీరినట్టే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు