Tollywood : ఎలక్షన్స్ సీజన్ ను క్యాష్ చేసుకోబోతున్న ముగ్గురు స్టార్స్

ఎలక్షన్స్ అనగానే సినిమాలకు నష్టాలు వచ్చే సీజన్ అని ఫిక్స్ అయిపోయారు సినిమా జనం. కానీ ప్రస్తుతం కొంతమంది మేకర్స్ ఈ నష్టాల సీజన్ నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పోలింగ్ మరో నెల రోజులు వెనక్కి వెళ్లడం వల్ల కల్కి లాంటి పాన్ వరల్డ్ సినిమాలకు నష్టం కలిగితే, మరో ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం దాన్ని క్యాష్ చేసుకోబోతున్నారు. పోలింగ్ మే 13న ఉండగా, అంతలోపు రిలీజ్ అయ్యే సినిమాలకు కంటెంట్ బాగుంటే కలెక్షన్ల వర్షమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఇంతకీ ఎలక్షన్స్ సీజన్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఆ హీరోలు ఎవరెవరు అంటే?

1. ఫ్యామిలీ స్టార్
ఎలక్షన్స్ కు ఇంకా రెండు నెలల సమయం ఉండగా, ఇప్పటినుంచి ఆ హడావుడి మొదలైపోయింది. ఇక ఎలక్షన్స్ టైంలో సినిమాలను రిలీజ్ చేసినా పెద్దగా ఉపయోగం లేదని మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం తమకు కలిసొస్తున్న ఈ ఎలక్షన్స్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అందులో ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ఒకటి. ఎలక్షన్స్ ఒక నెల వెనక్కి వెళ్ళకపోయి ఉంటే ఫ్యామిలీ స్టార్ పై ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉండేది. కానీ విజయ్ దేవరకొండ టైం బాగున్నట్టుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి ఎగ్జామ్స్ అన్ని పూర్తయి సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇది ఫ్యామిలీ స్టార్ కు కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. హాలిడేస్ కు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కంటెంట్ బాగుంటే ఫ్యామిలీ స్టార్ కు కాసుల వర్షమే.

2. టిల్లు స్క్వేర్
ఇక ఫ్యామిలీ స్టార్ కంటే ముందు ఈ ఎలక్షన్స్ సీజన్ లో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో సందడి చేయబోతున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మార్చ్ 29న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మూవీపై మంచి బజ్ ఏర్పడింది. పలు వాయిదాల అనంతరం చివరకు మార్చ్ 29న థియేటర్లలోకి రాబోతున్న టిల్లు స్క్వేర్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు. ఇందులో ముఖ్యంగా అనుపమ రొమాన్స్ చూడడానికే జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. వీరిద్దరికి కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై వర్క్ అవుట్ అయ్యిందంటే ఎలక్షన్ హీట్ ను మూవీ లవర్స్ పక్కన పెట్టేస్తారు. కాబట్టి నిర్మాతలకు లాభాల పంటే.

- Advertisement -

3. ఓం భీమ్ బుష్
వీరిద్దరి కంటే ముందు మరో యంగ్ హీరో శ్రీవిష్ణు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. మార్చి 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఓం భీమ్ బుష్ జనాలను చెక్కిలిగింతలు పెట్టగలిగితే వారం రోజుల పాటు థియేటర్లలో ఇదే సందడి ఉంటుంది. సంక్రాంతి తర్వాత సరైన హిట్ మూవీ లేకపోవడం కూడా ఓం భీమ్ బుష్ కు కలిసి వచ్చే అంశమే.

మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ను శ్రీ విష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి. ఎలక్షన్స్ లోపే అంటే ఏప్రిల్ 11న మరో ఇంటరెస్టింగ్ మూవీ “గీతాంజలి మళ్లీ వచ్చింది” కూడా రిలీజ్ కాబోతోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు