Suriya : సూర్య భుజాలపై పెద్ద బాధ్యత… పాన్ ఇండియా లోటును తీరుస్తాడా?

టాలెంటెడ్ హీరో సూర్య భుజాలపై ఇప్పుడు పెద్ద బాధ్యతే పడింది. తమిళ తంబీలు కలలుగంటున్న పాన్ ఇండియా మూవీని కోలీవుడ్ కు ఇచ్చే స్టార్ సూర్య అవుతాడు అనే అంచనాలు పెరిగాయి. దానికి కారణం తాజాగా రిలీజ్ అయిన “కంగువ” టీజర్. కోలీవుడ్లో ఉన్న ఇతర స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఈ లోటును సూర్య తీరుస్తాడా? అంటే…

కోలీవుడ్ పాన్ ఇండియా కల…
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ నే చెప్పుకునేవారు. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్ దూకుడు ముందు అన్నీ ఇండస్ట్రీలు చతికిల పడిపోయాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా రేసులో కోలీవుడ్ వెనకబడిపోయింది. వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాలతో సత్తా చూపిస్తున్నప్పటికీ తమిళ తంబీలు ప్యాన్ ఇండియా రేసులో మూడో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానం టాలీవుడ్ దే. మరి ఇప్పటిదాకా కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాలేదా? అంటే అయ్యాయి. విక్రమ్, జైలర్, లియో, పొన్నియన్ సెల్వన్ వంటి చాలా సినిమాలు పాన్ ఇండియా పేరుతో రిలీజ్ అయ్యాయి.

కానీ ఒక్క సినిమా కూడా తమిళంలో తప్ప ఇతర భాషల్లో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు “కంగువ”తో తమిళ ఇండస్ట్రీ నుంచి అసలైన పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో సూర్య చూపిస్తాడని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇప్పటిదాకా కమల్ హాసన్, విజయ్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు తీర్చలేకపోయిన కోలీవుడ్ పాన్ ఇండియా కలను సూర్య తీర్చేస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సూర్య కూడా తన కొత్త మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో కోలీవుడ్ సత్తా చాటి, తమిళ తంబీల నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నారు.

- Advertisement -

“కంగువ”తో సాధ్యమేనా?
హీరోగా సూర్య, డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ “కంగువ”. ఈ మూవీలో బాబీ డియోల్ తో పాటు దిశా పటాని, జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవి క్రియేషన్స్ బ్యానర్లపై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణా రెడ్డి, కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చ్ 19న కంగువ టీజర్ ను రిలీజ్ చేశారు. అందులో లాంగ్ హెయిర్ తో సూర్య ఇంటెన్స్ గెటప్ లో, ఓ తెగకు నాయకుడిగా కనిపించారు. టీజర్ లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్ లో చూపించిన సన్నివేశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ నిజానికి సూర్యకు సౌత్ లో తప్ప నార్త్ లో పెద్దగా మార్కెట్ లేదు. ఈ మూవీ కంటెంట్ తో నార్త్ ఆడియన్స్ ను కూడా సూర్య మెప్పించగలిగితే తప్ప కోలీవుడ్ పాన్ ఇండియా కల సాకారం అయ్యే అవకాశం లేదు. నిజానికి సూర్యకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న రజనీకాంత్ సైతం సాధించలేని పాన్ ఇండియా ఘనతను సూర్య “కంగువ”తో సాధించి చూపిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోందని వినికిడి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు