Ustaad Bhagath Singh : అతన్నే నమ్ముకున్న శ్రీలీల… అందుకేనా ఈ గ్యాప్?

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు తన స్పీడుకు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు వరుస డిజాస్టర్లు ఎదురు కావడంతో కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ సరసన తాను హీరోయిన్ గా నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ రిజల్టుని బట్టి ఆచితూచి నెక్స్ట్ స్టెప్ వేయాలని ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫ్యూచర్ అంతా పవర్ స్టార్ చేతుల్లోనే ఉందన్నమాట.

శ్రీలీల లైఫ్ లైన్ అతననే ఇప్పుడు…
శ్రీలీల తన అందచందాలు, డాన్సింగ్ స్కిల్స్ తో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె డాన్స్ టాలెంట్ కు యూత్ అంతా ఫిదా అయిపోయారు. కొంతమంది స్టార్ హీరోలు సైతం ఈ బ్యూటీ ఎనర్జిటిక్ డాన్స్ ను చూసి తడబడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇదే శ్రీలీల కెరీర్ కు శాపంగా మారింది. కొంతమంది కేవలం ఆమె డాన్స్ ను వాడుకోవడానికి మాత్రమే సినిమాల్లోకి తీసుకుంటే, మరికొంతమంది మాత్రం ఆమెతో స్టెప్పులు వేయడానికి హీరోలు ఇబ్బంది పడుతున్నారనే కారణంతో దూరం పట్టేశారు. ఇక ఈ బ్యూటీ కూడా కంటెంట్ తో పని లేకుండా వరుస సినిమాలకు సైన్ చేసి కెరీర్ ను డేంజర్ లో పడేసుకుంది. అయితే తాజాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” టీజర్ లో మెరిసింది శ్రీలీల. టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగులు, స్వాగ్, స్టైల్, బిజిఎం ఒక ఎత్తైతే, శ్రీలీల మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్నది ఇదొక్క మూవీనే. ఈ మూవీ రిజల్ట్ ని బట్టే శ్రీలీల నెక్స్ట్ మూవీ ఫిక్స్ అవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం నెక్స్ట్ మూవీకి సైన్ చేయడానికి శ్రీలీల రెడీగా లేదు అనే టాక్ నడుస్తోంది. మరి ఉస్తాద్ శ్రీలీల కెరీర్ ను సరైన ట్రాక్ లో పెడతాడా? ఈ మూవీతో శ్రీలీల రేంజ్ మారిపోతుందా? అంటే సమాధానం ఇంకా తెలియదు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఆశలన్నీ ప్రస్తుతం పవర్ స్టార్ పైనే పెట్టుకుంది.

అవకాశాలను వదులుకుని తప్పు చేస్తోందా?
ధమాకా వంటి లాటరీ హిట్ తప్ప శ్రీలీల కెరీర్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రీసెంట్ గా మహేష్ బాబు తో గుంటూరు కారం మూవీలో నటించే అద్భుతమైన ఛాన్స్ ఆమెకు దక్కినప్పటికీ, దాని క్రెడిట్ అంతా మహేష్ ఖాతాలోనే పడిపోయింది. దీంతో శ్రీలీలకు ఒరిగిందేమీ లేదు. వరస డిజాస్టర్లు అందుకుంటున్న ఈ బ్యూటీకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గి, ఐటమ్ సాంగ్ ఆఫర్లు పెరిగాయి. కానీ శ్రీలీల మాత్రం అలాంటివి చేయడానికి రెడీగా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె దగ్గరికి వస్తున్న అవకాశాలను ఎలాంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేస్తోందట. మరి ఈ అమ్మడు వచ్చిన అవకాశాలను వదులుకొని తప్పు చేస్తోందా లేక ఇదే ఆమె తీసుకున్న తెలివైన నిర్ణయమా? ఉస్తాద్ భగత్ సింగ్ తన కెరీర్ ను మలుపు తిప్పుతాడు అనే కాన్ఫిడెన్స్ ఓవర్ అయ్యిందా? అనేది ఉస్తాద్ రిజల్ట్ తేలుస్తుంది. ఒకవేళ ఈ మూవీ గనుక అంచనాలను అందుకోలేకపోతే శ్రీలీల కెరీర్ కు ఎండ్ కార్డు పడ్డట్టే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు