Sukumar: చరణ్ కూడా సైలెంట్ షాక్ ఇస్తాడేమో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చరణ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సింది అవసరం లేదు. చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అయితే మొదటి సినిమా తోనే తనలోని టాలెంట్ ని బయటికి తీసి చిరు తనయుడు అనిపించుకున్నాడు. కేవలం నటనలోనే కాకుండా డాన్సుల్లో కూడా ఇరగదీసాడు అని చాలామంది ప్రశంసలను అందించారు.

చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా మగధీర. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించాడు చరణ్. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు అని చెప్పొచ్చు. తన రెండవ సినిమాతోనే మంచి రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది.

అయితే ఆరెంజ్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మగధీర సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం. అప్పటికే ఈ సినిమా పాటలు మారుమోగిపోవడం. చరణ్ లుక్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా అనిపించడం. ఇవన్నీ కూడా ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. అయితే థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకి ఈ సినిమాతో నిరాశ ఎదురయిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే చరణ్ తర్వాత చాలా సినిమాలు చేశాడు. ఎవడు, రచ్చ, నాయక్, జంజీర్, గోవిందుడు అందరివాడే వంటి సినిమాలు చరణ్ కి ఒక మోస్తరుగా ఆడాయి అని చెప్పొచ్చు. అయితే తమిళ్ తనివరున్ కి రీమేక్ గా వచ్చిన ధ్రువ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. చరణ్ లోని మరో కోణాన్ని బయటకు తీసింది ఆ సినిమా.

అయితే ప్రతి హీరో కెరియర్ లో తన దిశను మార్చే సినిమా ఒకటి ఉంటుంది. అలా చరణ్ విషయానికి వస్తే రంగస్థలం అని చెప్పొచ్చు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. కేవలం రామ్ చరణ్ లోనే కాకుండా, సుకుమార్ ఇలాంటి సినిమాలు కూడా తీయగలడు అని నిరూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలంలో ప్రతి ఎలిమెంట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది.

చరణ్ లోని ఇంత టాలెంట్ ఉందా అని చాలామందికి ఆ సినిమాలోని రుజువైంది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో రానుంది. అయితే రంగస్థలం సినిమా తర్వాత చరణ్ తో సుకుమార్ మళ్లీ సినిమా చేస్తానని ఇదివరకే చెప్పుకొచ్చాడు. అయితే వీరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా వీరిద్దరి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని కూడా విశ్వసినీ వర్గాల సమాచారం. మరోసారి వీరి కాంబినేషన్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు