Personality Development : ఎవ్వరైనా మిమ్మల్ని చూడగానే ఇష్టపడాలంటే ఈ లక్షణాలు ఉండాల్సిందే

కొంతమందిని చూడగానే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. పెద్దగా పరిచయం లేకపోయినా చనువుగా మాట్లాడగలుగుతాం, కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. సరదాగా గడుపుతూ క్షణాల్లోనే వాళ్లను ఇష్టపడడం మొదలు పెడతాము. అయితే మీరు కూడా ఇలా ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా మిమ్మల్ని చూడగానే ఇష్టపడాలి అంటే సైకాలజీ ప్రకారం కొన్ని లక్షణాలు ఉండాల్సిందే. ఆ లక్షణాలు ఏంటి? అంటే

1. జడ్జ్మెంట్ ఫ్రీ మైండ్ సెట్ ను డెవలప్ చేసుకోండి
జనాలు ముందుగా ఆలోచించేది అవతలి వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించాడు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అని కాదు. వాళ్ళు ఎదుట ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాము అనేదే ముఖ్యం. కాబట్టి మీరు ఎట్రాక్టివ్ గా మారడానికి జడ్జ్మెంట్ ఫ్రీ మైండ్ సెట్ అనేది హెల్ప్ చేస్తుంది. మీరు జడ్జ్ మెంటల్ గా మాట్లాడితే అది నెగిటివ్ గా మారి అవతలి వ్యక్తిని బాధపెట్టే ప్రమాదముంది. ఫలితంగా ప్రజలు మీ నుంచి దూరంగా పారిపోతారు. కాబట్టి సానుభూతితో ఇతర వ్యక్తుల మాటలను వింటే, ప్రతి ఒక్కరూ మీ దగ్గర సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు. ఓపెన్ గా మాట్లాడుతారు.

2. షో అథెంటిక్ సెల్ఫ్
ఎవరైనా మిమ్మల్ని ఇన్స్టెంట్ గా ఇష్టపడాలి అంటే మీ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. మీ ఒరిజినాలిటీని, వ్యక్తిత్వాన్ని నిజంగా బయట పెట్టాలి. మీరు మీలా ఉంటే చాలు. సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోండి. మీ విలువలకు ప్రాధాన్యతనివ్వండి. అప్పుడే ఇతరులు మిమ్మల్ని వెంటనే ఇష్టపడతారు.

- Advertisement -

3. జెన్యూన్ డిజైర్
ఇతరులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మంచి పాజిటివ్ ఫీలింగ్ కలగాలి అంటే ముఖ్యమైంది మైండ్ ఫుల్ లిజనింగ్. అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినండి. ఉత్సాహంగా అవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉండండి. దీనివల్ల మీరు ఇతరులకు అట్రాక్టివ్ గా, పాజిటివ్ గా కనిపిస్తారు. ఫలితంగా మంచి సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా వాళ్ళ నుంచి ఏవైనా మంచి విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.

4. ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్
మన బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా ఎలా నిలబడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేవి మన స్వభావాన్ని, ఎమోషన్స్ ను బయటపెడతాయి. ఇవి కూడా అవతలి వ్యక్తి మీ గురించి ఒక ఒపీనియన్ కు రావడానికి ముఖ్యమైన అంశాలే అవుతాయి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇన్స్టంట్ గా ఇష్టపడాలని మీరు కోరుకుంటే కాన్ఫిడెంట్ గా ఉండండి. ఓపెన్ బాడీ లాంగ్వేజ్ తో ఉండాలి. ఇతరుల పర్సనల్ స్పేస్ కు రెస్పెక్ట్ ఇవ్వండి. మనస్ఫూర్తిగా నవ్వండి. వాళ్ళు చెప్పే దానికి మనస్ఫూర్తిగా రియాక్ట్ అవ్వండి. మీ హెడ్ హైలో, బ్యాక్ స్ట్రైట్ గా ఉండేలా చూసుకోండి. అలాగే మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండకండి. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించొచ్చు. కానీ ఒక్కసారి ఫాలో అయ్యి చూస్తే తెలుస్తుంది మ్యాజిక్ ఏంటో.

5. హద్దు దాటకండి
అవతలి వ్యక్తి మీరు ఎదుట ఉన్నప్పుడు సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వాలి. అంటే మీరు వాళ్లకు గౌరవం ఇవ్వడం, వాళ్ల బౌండరీస్ కు రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యం. అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారేమో గమనించండి. వాళ్లకు ఏదైనా అవసరమా అని అడగడానికి భయపడకండి. వాళ్లు సెట్ చేసుకున్న బౌండరీస్ దాటినప్పుడు క్షమాపణలు చెప్పండి. మళ్లీ అలా చేయకండి.

6. తప్పు మంచిదే
సాధారణంగా ఇతరులు తప్పు చేసినప్పుడు వాళ్ళను కొంచెం ఎక్కువగా ఇష్టపడతారు. ఉదాహరణకు సెలబ్రిటీలు తడబడడం లేదా కొంచెం నత్తిగా మాట్లాడినప్పుడు వాళ్లను మరింత ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. అంటే మీరు ఒక పర్ఫెక్ట్ వ్యక్తి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాని బదులు మీరు భయాందోళనలకు గురవుతున్నట్టు, లేదా మీరు కొత్త వారితో అడ్జస్ట్ అవ్వడానికి కొన్నిసార్లు కష్టపడుతున్నట్టు అనిపించేలా చేయండి. అప్పుడే ఇన్స్టంట్ గా మిమ్మల్ని ఎవరైనా సరే ఇష్టపడతారు. కాన్ఫిడెంట్ గా కనిపించారంటే దూరం పెట్టేస్తారు జాగ్రత్త.

7. నెగిటివిటీ వద్దు
ఇతరులపై కంప్లైంట్ చేయడం, వాళ్ల గురించి ఏదో ఒకటి గొనుగుతూ ఉండడం అనేవి సర్వసాధారణం. కానీ దీనివల్ల ఇతరులతో ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడాలని కోరుకుంటే ఈ అలవాటును దూరం పెట్టేయండి. ఆశావాద వ్యక్తులు, పాజిటివ్ గా ఉండే వారిని జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మైండ్ ఫుల్ నెస్, గ్రాటిట్యూడ్ ను ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు మీ జీవితంలో చిన్న చిన్న మ్యాజికల్ మూమెంట్స్ గురించి వెతకండి. మీలోని బెస్ట్ ను బయటకు తీసే వ్యక్తులు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు