Lifestyle: మనశ్శాంతి కావాలా? బుద్ధుడి చెప్పిన ఈ టిప్స్ మీ కోసమే

మానసిక ప్రశాంతత కోసం చాలామంది ఎన్నో రకాలుగా వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు వంటి వాటి ద్వారా ప్రశాంతత దొరుకుతుందని అపోహ పడుతుంటారు. కానీ మానసిక ప్రశాంతత అనేది ఆలోచనలో మార్పు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చాలామందికి తెలియదు. మిమ్మల్ని మీరు బెస్ట్ గా మార్చుకున్నప్పుడు మాత్రమే మనశ్శాంతిని పొందగలుగుతారు. అంతేగాని దాన్ని ఎక్కడా కొనలేరు. లేదంటే ఎవ్వరూ సహాయం చేయలేరు. అయితే పూర్వకాలంలో ఎంతోమంది ఋషులు, కవులు జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలి, ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి, మనశ్శాంతిగా ఎలా బ్రతకాలి అనే అద్భుతమైన విషయాలను భవిష్యత్ తరాల కోసం రాసిపెట్టారు. అందులో బుద్ధుడు బోధనలు చాలా ముఖ్యమైనవి. బుద్ధుడి బాటలో నడవడానికి, ఆయన చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడానికి ప్రపంచంలోని చాలామంది ఇష్టపడతారు. బుద్ధుడు చెప్పిన జీవిత తత్వాలను పాటిస్తే విజయానికి ఒక స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. ఫలితంగా జీవితంలో శాంతి, ప్రశాంతత రెండు దక్కుతాయి. మరి మనశ్శాంతి కోసం బుద్ధుడు ఏం చేయమన్నాడు అంటే…

1. తను కోపమే తన శత్రువు
ఈ సామెతను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అవతలి వ్యక్తి మీద కోపం పెంచుకోవడం వల్ల నష్టం మనకే అని చెప్పడమే దీని ఉద్దేశం. ఎందుకంటే కోపం, పగ వంటివి మనశ్శాంతిని దూరం చేస్తాయి. అవతలి వ్యక్తి బాగానే ఉంటాడు. కానీ మన కోపమే మనల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేసి, నరకయాతన అనుభవించేలా చేస్తుంది. కాబట్టి కూల్ గా ఉండడానికి ప్రయత్నించండి.

2. ఇదే వాస్తవం
బుద్ధుని బోధనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాస్తవాన్ని అంగీకరించడం గురించి. జీవితం అనిశ్చితి, మార్పు, అసంతృప్తితో నిండి ఉందని అర్థం చేసుకోవాలి. మనం కోరుకున్న విధంగా జీవితం ఉండకపోవడం వల్ల అసంతృప్తి ఎక్కువవుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం వల్ల, ఉన్నదానితో సంతోష పడడం వల్ల మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు.

- Advertisement -

3. ప్రస్తుతం గురించే ఆలోచించండి
భవిష్యత్తును అంచనా వేయలేము. అలాగని గతాన్ని తిరిగి తీసుకురాలేము. కాబట్టి గత జీవితం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్ గురించి అనవసరంగా టెన్షన్ పడటం వంటివి చేసి ఎనర్జీని కోల్పోకూడదు. ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగా, సంతోషంగా గడపండి.

4. కృతజ్ఞతా భావం
మానసిక ప్రశాంతత పొందడానికి ఇది కూడా ఒక అద్భుతమైన మార్గం అని చెప్పాలి. జీవితంలో మీరు పొందే ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత తెలపడం, మీకు దక్కిన ప్రతి దాన్ని ఒక వరంగా భావించడం వల్ల మనశ్శాంతి దక్కుతుంది. కాబట్టి మీ జీవితాన్ని అందంగా మార్చే ప్రతి ఒక్కరిపైన కృతజ్ఞతా భావం పెంచుకోండి.

5. మార్పులకు సిద్ధం
జీవితం క్షణికమైనది. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిరాశ, బాధలను పక్కన పెట్టి ఎలాంటి మార్పు కైనా సిద్ధంగా ఉండండి. బాధకు కుంగిపోకుండా, సంతోషానికి పొంగిపోకుండా ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేయండి.

6. మితమే హితం
ఏదైనా సరే అవసరానికి మించి ఉంటే మంచిది కాదు. సింపుల్ గా ఉంటేనే బెటర్. సింప్లిసిటీతో జీవిస్తే మనశ్శాంతి దానికదే దక్కుతుంది. గాసిప్స్, ఈగో, లెవెల్ చూపించడం వంటివి చేస్తే మానసిక ప్రశాంతతను కోల్పోతారు జాగ్రత్త.

7. అశాశ్వతత్వాన్ని స్వీకరించండి
బుద్ధుని బోధనలో ముఖ్యమైంది అశాశ్వతం అనే అంశం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని చెప్పారాయన. ఇబ్బందికర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. అలాగే జీవితాంతం సంతోషంగా కూడా ఉండలేము. ఎప్పుడైనా మంచి జరిగింది అంటే, ఆ తర్వాత చెడు కచ్చితంగా జరుగుతుంది. అలాగే చెడు తర్వాత మంచి. ఇదొక సర్కిల్ లాంటిది. కానీ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కుంటేనే మరింత స్ట్రాంగ్ అవుతారు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి కష్ట కాలం ఎదురైనప్పుడు ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దీనివల్ల ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా, ఆశాజనకంగా బ్రతకగలుగుతారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు