Pushpa The Rule: ఫస్ట్ పార్ట్ కే పిచ్చెక్కిపోయారు..సెకండ్ పార్ట్ కి ఏమైపోతారో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2021 డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ సినిమా చాలా పెద్ద హిట్టయ్యింది. అంతవరకు స్టైలిష్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఈ సినిమా తో నేషనల్ వైడ్ గా క్రేజ్ ని సంపాదించాడు. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా ఇరగదీసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కి పుష్ప ద్వారా నేషనల్ క్రష్ గా పేరొచ్చింది.

పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా 144 కోట్ల బిజినెస్ చేసింది. అయితే తెలుగు లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 15 కోట్ల స్వల్ప నష్టాలని మిగిల్చింది. కానీ హిందీ లో ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలైన పుష్ప మౌత్ టాక్ తో మెల్లి మెల్లి గా భారీ కలెక్షన్లు రాబట్టింది. హిందీ లో కేవలం 10 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 51 కోట్లకి పైగా షేర్ ని వసూలు చేసింది. 118 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా 184 కోట్ల షేర్ ని 360 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

పుష్ప సినిమాకి బాలీవుడ్ లో ఈ మధ్య ఏ సినిమాకి రానంత క్రేజ్ వచ్చింది. చాలా మంది సెలెబ్రిటీస్ కూడా ఈ సినిమా లోని పాటల్ని మేనరిజంని, డైలాగుల్ని స్పూఫ్ చేసారు. క్రికెటర్లు జడేజా, డేవిడ్ వార్నర్ లు కూడా పుష్ప లోని డైలాగులు చెప్పారు.

- Advertisement -

ఇక తాజాగా పుష్ప ది రూల్ కి సంబంధించిన స్పెషల్ వీడియో ని రిలీజ్ చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు తెలుగు వీడియో కి 19 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీ వీడియోకి మాత్రం 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే తెలుగు వెర్షన్ కి గాను 590k లైక్స్ రాగా, హిందీ వెర్షన్ కి ఏకంగా 1.2 మిలియన్ల లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి పుష్ప కోసం మన కంటే బాలీవుడ్ ఆడియన్స్ ఎక్కువ ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. ఇక టీజర్ తో ఇప్పుడే ఇంత హైప్ వస్తే, ఇక ట్రైలర్ వచ్చే సరికి ఈ సినిమా హైప్ ఏ రేంజ్ కి వెళ్తుందో.

ఇక హిందీలో పుష్ప మొదటి పార్ట్ 120 కోట్లు వసూలు చేస్తే, పుష్ప ది రూల్ 500 కోట్ల వరకు వసూలు చెయ్యొచ్చని అంచనా వేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు