Kamal Hasan: ఇండియన్ -2 చైనా షెడ్యూల్ కంప్లిట్

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ -2 సినిమా ఇటీవలనే చైనా షెడ్యూల్ కంప్లిట్ చేసుకుంది. ఎన్నో వివాదాలు , వాయిదాల నడుమ చాలా కాలంగా మధ్యలోనే ఆగిపోయిన ఈ మూవీ ఫైనల్లీ సెట్స్ పైకి వెళ్లి విజయవంతంగా చైనాలోని తైవాన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ” భారతీయుడు” మూవీ కి సీక్వెల్ గా రాబోతుంది.

భారతీయుడు మూవీ క్లైమాక్స్ లో సేనాపతి {భారతీయుడు సినిమాలో కమల్ పేరు ) చిన్న పిల్లల చావు కి కారణం అయ్యాడు. అనే కారణం తో సొంత కొడుకునే చంపి పోలీసుల నుంచి తప్పించుకొని విదేశాల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఇండియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి భారతీయుడు బతికే ఉన్నాడు, తప్పు చేస్తే తిరిగి వస్తాడు అని జనాలకి చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు అక్కడితో సినిమా అయిపోతుంది.

అయితే ఆ తరువాత సేనాపతి ఎక్కడికి వెళ్ళాడు ? మళ్ళీ ఇండియాకి ఎలా వచ్చాడు? అనేది కోర్ పాయింట్ గా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఇటీవలనే ఫినిష్ చేసినట్టు శంకర్ ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసారు. ఒక పక్క రామ్ చరణ్ ” గేమ్ చెంజర్ “ మూవీ, మరోపక్క ఇండియన్ -2 ఏకకాలం లో షూట్ చేసారు శంకర్. అయితే రెండు సినిమాలు పొలిటికల్ నేపథ్యం లోనే వస్తుండటం విశేషం. పైగా శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ సబ్జక్ట్స్ తీయటం లో దిట్ట. సినిమా, సినిమాకి ఇయర్స్ గ్యాప్ తీసుకునే శంకర్ రెండు సినిమాలు వెంట వెంటనే రిలీజ్ లు ఉంటడం, సినీ లవర్స్ కి ఫీస్ట్ అని చెప్పొచ్చు

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు