Ravanasura: ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరవాలేదు

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ “రావణాసుర” ఏప్రిల్ 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ ల తర్వాత వస్తున్న సినిమా కావడం తో రవితేజ ఫ్యాన్స్ ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, అభిషేక్ పిక్చర్స్ పైన అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, ఫారియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్ హీరోయిన్లు గా నటించారు. సుశాంత్ ఈ సినిమాలో తొలిసారిగా విలన్ గా నటించాడు. ఇంకా జయరాం, హైపర్ ఆది, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమా కు సంగీతం అందించారు. ఏప్రిల్ 7 న విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. రవితేజ ఫ్యాన్స్ ని తప్ప, కామన్ ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించలేకపోయింది. డైరెక్టర్ ఈ సినిమా కథ బాగానే రాసుకున్నా స్క్రీన్ ప్లే తో మాత్రం మెప్పించలేదు. రవితేజ వన్ మ్యాన్ షో గా ఈ సినిమా నిలిచింది. తాజా గా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు బయటికి వచ్చాయి.

రావణాసుర ఫస్ట్ డే ఏపీ, నైజాం కలిపి 4.29 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 4.85 కోట్లు షేర్ ని, 7. 86 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.
23 కోట్ల టార్గెట్ తో బారి లోకి దిగిన రావణాసుర ఇంకా 18 కోట్లు వసూలు చేయాలి. మరి ఈ టాక్ తో ఐపీఎల్ ఎఫెక్ట్ ని కూడా తట్టుకుని ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు