Kushi Trailer Release Date Locked: విజయ్ తొడలపై సమంత.. చైతు ఫ్యాన్స్ ఆగ్రహం!

Kushi Trailer Release Date Locked

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాగచైతన్య – సమంత ఓ టైమ్ లో టాలీవుడ్ బెస్ట్ కపుల్. కానీ ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకుంది. ఈ క్యూట్ కపుల్ ఇచ్చిన షాక్ కు ఫ్యాన్స్ కోలుకోలేకపోయారు. అయితే చైతుకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే యశోద మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఖుషి సినిమాతో మరోసారి ప్రేక్షకులను కనువిందు చేసేందుకు సిద్ధమైంది.

విజయ్ దేవరకొండ – సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ కి రెడీ అయింది. అయితే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ మూవీ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.

ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ – సమంత మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. విజయ్ దేవరకొండ తొడలపై సమంత కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసినట్లు ఈ పోస్టర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ చూసిన చైతు ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బరితెగించినటించాల్సిన అవసరం ఏముందని సమంతపై మండిపడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు