Rajinikanth: జైలర్ సినిమా నెవెర్ బిఫోర్ రికార్డ్- కెజీఎఫ్2 ను మించి..

Rajinikanth jailer movie new record

రజనీకాంత్ లేటెస్ట్ సినిమా జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ లో మరియు నెంబర్ అఫ్ షో కౌంట్ లలో నెవెర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ రికార్డ్ ను సెట్ చేస్తుంది. సాంగ్స్ తో ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన జైలర్ సినిమా ఈ నెల 11న థియేటర్స్ లో విడుదల కానుంది.ఈ సినిమాలో రజనీకాంత్ , తమన్నా ప్రధాన తారాగణంగా రమ్య కృష్ణ, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలలో నటించబోతున్నారు.

కామెడీ, యాక్షన్ ప్రధానంగా సాగె ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా జైలర్ సినిమా ఆడియో పెద్ద హిట్ అయింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోను రికార్డ్ చేస్తుంది. తెలుగులో జైలర్ కు పోటీగా మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఒకరోజు ముందుగానే రిలీజ్ అవ్వబోతున్న కూడా భోళా శంకర్ కంటే ఎక్కువ బుకింగ్స్ జైలర్ కే జరుగుతున్నాయి.

అలాగే జైలర్ డామినేషన్ కేవలం తెలుగులోనే కాదు అన్ని స్టేట్స్ లోను గట్టిగ ఉన్నట్టు తెలుస్తుంది. జైలర్ సినిమాకు బెంగుళూరు కెజీఎఫ్ పార్ట్ 2 ను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కాగా హాలీవుడ్ సెన్సేషన్ అయిన అవతార్ 2సినిమాకు 1014 షో లు కేటాయించగా ఆ రికార్డ్ ను కేజీయఫ్ 2 కి 1037 షో లతో బ్రేక్ చేసింది ఇక లేటెస్ట్ గా జైలర్ సినిమా ఏకంగా 1093 షోస్ తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే ప్రేక్షకుల్లో జైలర్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందొ స్పష్టమవుతోంది. ఒక పక్క అడ్వాన్స్ బుకింగ్స్ లో మరోపక్క నెంబర్ అఫ్ షో లతో జైలర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. మరీ రిలీజ్ తరువాత జైలర్ ఇంకెన్ని రికార్డ్స్ సెట్ చేస్తుంది చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు