Baby : చాలా రోజుల తరువాత కనిపించిన వైష్ణవి చైతన్య

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమాలలోకి వెళ్లిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే షార్ట్ ఫిలిమ్స్ వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఒకే గాని హీరోయిన్ గా, హీరోగా అవకాశం రావడం మాత్రం చాలా కష్టమనే చెప్పాలి. రాజ్ తరుణ్ , కిరణ్ అబ్బవరం, వైవా హర్ష, చాందిని చౌదరి ,లాంటి ఒకరు ఇద్దరు తప్ప యూట్యూబ్ నుంచి వెళ్లి సక్సెస్ అయిన యాక్టర్స్  ఎవరు పెద్దగా లేరు.

అయితే లేటెస్ట్ మరో అమ్మాయి యూట్యూబ్ నుంచి వెండి తెరకి హీరోయిన్ గా పరిచయమవబోతుంది ఆమెనే వైష్ణవి చైతన్య. హృదయ కాలేయం , కొబ్బరి మట్ట ఫెమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం “బేబీ ” ఆనంద్ దేవరకొండ , విరాజ్ అశ్విన్ , వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే అయిపోయిన రిలీజ్ మాత్రం లెట్ అవుతూ వస్తోంది.గతంలో మూవీ టీం రిలీజ్ చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తరువాత నుంచి మూవీ కి సంబంధించి పెద్దగా అప్డేట్స్ ఏమి రాలేదు. ప్రేక్షకులు సినిమా మర్చిపోతున్నారు అనుకున్నారేమో గాని ఈ మధ్యనే దేవరాజ అంటూ సాగే ఒక పాటని విడుదల చేసారు ఈ సాంగ్ ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నిలిచింది.

నిన్న (సోమవారం) రోజున బేబీ మూవీ టీం శ్రీనిధి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కాలేజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.తొందరలోనే ఈ సినిమాకి సంబందించి మూడో పాటని రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ఎనౌన్స్ చేసారు. సాయి రాజేష్ ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మాస్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ చివరలో సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు