Tollywood: ఆ డైరెక్టర్ల శిష్యులు ఏమయ్యారు..?

టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మొదలైన ఈ హవా మొన్నటి దసరా, నిన్న విడుదలైన విరుపాక్షతో అజేయంగా సాగుతోంది. సుకుమార్ శిష్యులు బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల తమ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరిని ఆశ్చర్య పరిచారు. ఇటీవల విరూపాక్షతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ దండుకి ఇది రెండవ సినిమా అయినప్పటికీ హార్రర్ జానర్ లో సినిమాని ఎఫెక్టివ్ గా డీల్ చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అదేంటంటే, సుకుమార్ శిష్యులు మాత్రమే ఎందుకు వరుసగా సక్సెస్ అవుతున్నారు. ఇది సుకుమార్ ట్రైనింగ్ మహత్యమా లేక వారి ట్యాలెంటా అని నెటిజన్లు చర్చిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ తర్వాత అంతటి సంఖ్యలో శిష్యులు సక్సెస్ అవ్వటం ఒక్క సుకుమార్ కే సాధ్యమైంది. ఇక్కడ ఇంకో ఆసక్తికర ప్రశ్న ఏంటంటే, మిగతా దర్శకులకు శిష్యులు ఉండరా?, ఉంటే వాళ్ళెందుకు సక్సెస్ అవ్వట్లేదు. మిగతా దర్శకుల్లో మ్యాటర్ లేకపోవటమే కారణమా? లేక మిగతా డైరెక్టర్లు శిష్యుల్ని పైకి రానివ్వరా అన్న చర్చ కూడా నడుస్తోంది సోషల్ మీడియాలో.

ఏదేమైనా సుకుమార్ శిష్యుల వరుస హిట్ల పరంపర మిగతా డైరెక్టర్ల ప్రాణానికి వచ్చినట్లయింది. స్వతహాగా లెక్కల మాష్టారైన సుకుమార్ తన శిష్యులకు సినిమా పాఠాలు కూడా బాగానే నేర్పినట్టున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. డైరెక్టర్లు గా మారుతున్న తన శిష్యులకు సుకుమార్ కథ పరంగానో, ప్రొడక్షన్ విషయంలోనే ఎదో ఒక రకంగా సపోర్ట్ ఇస్తూ ఉండటం విశేషం. అయితే మిగిలిన డైరెక్టర్ల శిష్యులు వెలుగులోకి రానంత మాత్రాన వారిని తక్కువ చేయటం కరెక్ట్ కాదు, ఎవరి స్పెషాలిటీ వారికి ఉంటుందని గమనించాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు