Gopichandh : శ్రీలీల రేంజ్ పెరిగింది.

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు.

మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకుంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజె అయిన శ్రీలీల మాత్రం తన అందం , అభినయంతో అందరి మనసులు గెలుచుకుంది. పెళ్లి సందడి సినిమాలో ఆమె చేసిన పెర్ఫామెన్స్ ,డాన్స్ సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ట్రెండ్ అయ్యాయి. దాంతో ఈ బ్యూటీకి మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

ఇక ధమాకా సినిమా సూపర్ హిట్ అయి. రవితేజని 100 కోట్ల హీరోని చేసింది. అలాగే శ్రీలీలని తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ని చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజన్ సినిమాలతో వచ్చే మరో మూడు ఏళ్లపాటు బిజీ హీరోయిన్ గా అయిపొయింది. పైగా శ్రీలీల చేసే సినిమాలేవీ చిన్న ,చిన్న సినిమాలు కూడా కాదు అన్ని పెద్ద హీరోల , పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , మహేష్ త్రివిక్రమ్ కాంబో లో వస్తోన్న సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోన్న శ్రీలీల వైష్ణవ్ తేజ్ ,నితిన్ లాంటి యంగ్ హీరోల సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.

- Advertisement -

అయితే శ్రీవాస్ దర్శకత్వంలో గోపించంద్ హీరోగా వస్తోన్న చిత్రం ” రామబాణం ‘ ఇప్పటికే వీరిద్దరి కాంబినేషలో వచ్చిన లక్ష్యం , లౌక్యం సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే ఏ విషయంలోనూ తగ్గకుండా ట్రేండింగ్ లో ఉన్న వాళ్ళని సినిమాకి సంబంధించిన వాటిలో భాగం చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు . లేటెస్ట్ గా ఈ సినిమాలో ఉండే ఒక లవ్ మెలోడీ సాంగ్ ని శ్రీలీల తో లాంచ్ చేయించారు. గోపీచంద్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్న సినిమా సాంగ్ శ్రీలీల లాంచ్ చేసింది అంటే శ్రీలీల రేంజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు