Nani : ఎక్కడ చుసిన కీర్తినే కనిపిస్తుంది

రామ్ పోతినేని హీరోగా వచ్చిన “నేను శైలజ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే కీర్తి సురేష్ అందరిని ఆకట్టుకుంది. నేను శైలజ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయి అప్పటివరకు ప్లాప్ లో ఉన్న హీరో రామ్ ని మళ్ళీ హిట్ బాట పట్టించింది. ఈ సినిమా తరువాత కీర్తి వరుస తమిళ్ సినిమాలతో బిజీ అయిపొయింది. కొంచెం గ్యాప్ తరువాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగులో నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా హిట్ అవడంతో కీర్తి తెలుగులో గోల్డెన్ లెగ్ గా మారింది.

ఆ తరువాత ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయి కీర్తి కెరీర్ నే మార్చేసింది. మహానటి సినిమాకి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అప్పటి నుంచి కీర్తి సురేష్ ఆమె చేసే సినిమాని చాలా జగ్రత్తగా ఎంపిక చేసుకుంటుంది. గ్లామర్ రోల్ లకి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆమె యాక్టింగ్ కనిపించే పాత్రలనే ఆమె ఎంచుకుంటుంది.

రీసెంట్ గా కీర్తి సురేష్ దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 100 కోట్లతో ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ సింగల్ టేక్ లో చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. కీర్తి సురేష్ డాన్స్ ని ,ఎక్స్ ప్రెషన్స్ ని మ్యాచ్ చేస్తూ యూత్ అమ్మాయిలంత ఆమెలాగే యెల్లో సారీ కట్టుకొని డాన్స్ వేస్తూ ఇంస్టాగ్రామ్ , ఫెస్ బుక్ , ట్విట్టర్ లో పోస్ట్ వీడియో రికార్డు చేసి పోస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఇదే మ్యూజిక్ కి ఆ షో మెంటర్ ఇంద్రజ డాన్స్ వేశారు. కానీ ఎంత మంది చేసిన కీర్తి సురేష్ లాగా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా యువత. మరి నేషనల్ అవార్డు విన్నర్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం అంటే మాటలా..

- Advertisement -

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు