Fitness Tips : మహిళలను ఫిట్ గా మార్చే యోగాసనాలు ఇవే

Fitness Tips :  ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజు చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆఫీస్ తో పాటు ఇంటి పనులు చూసుకునే మహిళలు వ్యాయామం కచ్చితంగా చేయాల్సిందే. వర్కింగ్ ఉమెన్స్ కు వ్యాయామం చేయడానికి తగినంత సమయం, శక్తి ఉండవు. పని చేసే మహిళలు ఎక్కువ సమయం డెస్క్ ముందు కూర్చుని గడుపుతారు. ఇలాంటి వారికి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ ఫిట్ గా, చురుగ్గా ఉండడానికి ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. ఇలాంటి వాళ్లకు యోగ బెస్ట్ ఆప్షన్. రెగ్యులర్ గా యోగాను సాధన చేయడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఒత్తిడికి దూరంగా ఉంటారు. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా యోగ చాలా మంచిది. మరి మహిళలు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి యోగాసనాలు ( Fitness Tips ) వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భుజంగాసనం

సూర్య నమస్కారంలోని 12 ఆసనాలలో ఈ ఆసనం 8వది. దీనిని సర్పాసనం లేదా పాము ముద్ర అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆసనం వేసేటప్పుడు శరీరం పాము ఆకారంలో ఉంటుంది. భుజంగాసనాన్ని బోర్లా పడుకుని చేతుల సాయంతో నడుము వరకు తలను పైకెత్తాలి. ఖాళీ కడుపుతో ఈ ఆసనాన్ని వేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భుజంగాసనం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ ఆసనంతో ఈజీగా బరువును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ను.

2. వీరభద్రాసనం

ఈ ఆసనాన్ని యోధుల భంగిమ అని కూడా అంటారు. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. స్థిరత్వం, ధైర్యాన్ని పెంచే యోగాసనం ఇది. వీరభద్రాసనం రెగ్యులర్ గా వేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు.

- Advertisement -

3. తడాసనం

తాద్ అంటే పర్వతం. పర్వతం లాంటి భంగిమ అనే అర్థం దీని పేరులోనే ఉంది. తడాసనం శారీరక, మానసిక సమతుల్యతను సృష్టిస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ను మెరుగుపరచడానికి తడాసనం హెల్ప్ చేస్తుంది. తొడలు, మోకాలు, చీల మండలను ఈ ఆసనం బలపరుస్తుంది.

4. శవాసనం

శవాసనం వేయడం వల్ల శరీరం రిలాక్స్ గా, చురుగ్గా ఉంటుంది. యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునే వారు కూడా శవాసనాన్ని వేస్తే బెటర్. కేవలం ఐదు నిమిషాల పాటు శవాసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరం ఫుల్ గా రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ క్షణాల్లోనే ఎనర్జిటిక్ గా మారతారు.

5. పశ్చిమోత్తనాసనం

పశ్చిమోత్తనాసనం ఒక క్లాసిక్ యోగా భంగిమ అని చెప్పొచ్చు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆసనాన్ని వేస్తారు. అలాగే మీ వెన్నుముకతో పాటు శరీరం మొత్తాన్ని బాగా సాగదీయడానికి పశ్చిమోత్తనాసనం ఉపయోగపడుతుంది. ఫలితంగా శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తగ్గుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు