AlluArjun : అల్లు అర్జున్ ఆయన భార్యకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

AlluArjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అల్లుఅర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. మెగా కుటుంబం అలాగే అల్లు వారి కుటుంబం అండతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్… ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పుడెప్పుడో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా మారిన అల్లు అర్జున్… ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అందుకునే స్థాయికి ఎదిగాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ తన కెరీర్ లో గంగోత్రి సినిమా తర్వాత..

ఆర్య అనే సినిమాతో మంచి స్టార్ డం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆర్య 2 తో కూడా సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరీర్ లో బన్నీ, హ్యాపీ, దేశముదురు లాంటి బంపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే… అల్లు అర్జున్ ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాసు దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో మంచి హిట్లు కొట్టాడు.

ఇప్పటికే త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ ( AlluArjun )కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చి హీట్ కొట్టాయి. వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి బంపర్ హిట్ సినిమాలు అందుకున్నాడు బన్నీ. ఇక ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయింది. ప్రస్తుతం రెండవ భాగం సినిమా కూడా వస్తోంది.

- Advertisement -

అల్లు అర్జున్ చేసిన చాలా సినిమాలు మలయాళం లోకి కూడా రిమేక్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ హీరోల తర్వాత అల్లు అర్జున్ కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తారు ఆయన ఫ్యాన్స్. ఇక అల్లు అర్జున్ పర్సనల్ విషయానికి వస్తే…. అయిన వివాహం స్నేహ రెడ్డితో మార్చి ఆరవ తేదీ 2011 సంవత్సరంలో జరిగింది. అంటే వీరి వివాహం జరిగి దాదాపు 15 సంవత్సరాలు కావస్తోంది.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ఏజ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ ఏజ్ 41 సంవత్సరాలు ఉంటుంది. అటు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వయసు 39 సంవత్సరాలు ఉంటుంది. అంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంత మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు