Tillu Square : టిల్లును ఎందుకు వదిలేసావ్ ? శ్రీలీల బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే

Tillu Square :  యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఏదో దరిద్రం పట్టినట్టుగా ఉంది. ఆమె ఏరి కోరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ కాగా ప్రస్తుతం కెరీర్ ఎండ్ దశకు చేరుకుంది. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీని శ్రీలీల చేజేతులా వదిలేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీని శ్రీలీల రిజెక్ట్ చేసింది. ఆమె స్థానంలో వచ్చిన అనుపమ క్రేజ్ ఈ సినిమాతో ఒక్కసారిగా పెరిగిపోయింది. మరి ఇంతకీ శ్రీలీల టిల్లును ఎందుకు రిజెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే…

టిల్లును శ్రీలీల ఎందుకు పక్కన పెట్టిందంటే?

టాలీవుడ్ లో నిన్న మొన్నటిదాకా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా, బ్రేకులు లేకుండా దూసుకెళ్లింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రవితేజ, బాలయ్య, రామ్ పోతినేని, మహేష్ బాబు, నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల దాకా అందరితోను ఆడి పాడింది. ఈ బ్యూటీకి అవకాశాలు అయితే వచ్చాయి గాని, లక్ మాత్రం కలిసి రాలేదు. రీసెంట్ గా మహేష్ బాబుతో ఆమె చేసిన గుంటూరు కారం మూవీ అయినా తనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందేమో అనుకుంటే దానివల్ల అసలు ఉపయోగమే లేకుండా పోయింది. వరుసగా డిజాస్టర్లు అందుకోవడంతో శ్రీలీలను కొత్త సినిమాల నుంచి పక్కకు తప్పించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండు మూడు కొత్త సినిమాల నుంచి శ్రీలీల తప్పుకోవలసి వచ్చింది. ఐటమ్ సాంగ్ ఆఫర్స్ వస్తున్నా ఈ బ్యూటీ రిజెక్ట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే… ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. పలు వివాదాలు కారణంగా ఈ మూవీ కొన్ని రోజులు ఆగిపోయింది. డైరెక్టర్, హీరోకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్న శ్రీలీల ఎప్పుడు తెరకెక్కుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో టిల్లు స్క్వేర్ మూవీ నుంచి తప్పుకుంది. టిల్లును పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టింది. తాజాగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ ను చూశాక శ్రీలీల కెరీర్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అనిపిస్తోంది. ఈ మూవీ గనక శ్రీలీల అకౌంట్లో పడి ఉంటే ఆమె రేంజ్ వేరే లెవెల్ అన్నట్టుగా ఉండేది. ఆ అద్భుతమైన అవకాశాన్ని అనుపమ కొట్టేసింది. లక్ అనుపమకు రాసి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఈ మూవీతో అనుపమ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే చాలామంది యూత్ థియేటర్లకు వెళ్తున్నారు అనేది నగ్నసత్యం. మొత్తానికి ఇలాంటి లక్కీ ఆఫర్ ను వదులుకొని శ్రీలీల తప్పు చేసిందని ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల కొత్త సినిమాలకేమీ సైన్ చేయలేదు. కానీ కోలీవుడ్ లో అవకాశాల కోసం చూస్తోందని టాక్ నడుస్తోంది.

- Advertisement -

టిల్లు క్యూబ్ తెరపైకి….

డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ఈరోజు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీకి మూడవ భాగం కూడా తెరకెక్కబోతుందని టాక్ నడుస్తోంది. దాన్ని కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే నిర్మించబోతున్నారు. టిల్లు క్యూబ్ పేరుతో ఈ సీక్వెల్ తెరపైకి రాబోతోంది. మరోవైపు టిల్లు స్క్వేర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఏకంగా 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు