Krithi shetty : కృతి శెట్టిని ఇబ్బంది పడుతున్న హీరో?

Krithi shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఉంటే మరికొంతమంది కిందిస్థాయి హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయినవారు చాలా ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ కృతి శెట్టి ఒకరు. హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వెండితెర పైకి ఉప్పెనెల దూసుకు వచ్చి… తన అందం అలాగే అభినయంతో కుర్ర కారు గుండెల్లో సునామి సృష్టిస్తోంది హీరోయిన్ కృతి శెట్టి ( Krithi shetty ).

తన తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన కృతి శెట్టి… తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుందని చెప్పవచ్చు. తన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఈ బ్యూటీ.

ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు వచ్చేసాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అటు కోలివుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తోంది. హీరోయిన్ కృతి శెట్టి ఈమధ్య చేసిన సినిమా కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో… తన కెరీర్లో మరో డిజాస్టర్ వేసుకుంది కృతి శెట్టి.

- Advertisement -

ఇక కృతి శెట్టి పర్సనల్ విషయానికి వస్తే పుట్టి పెరిగింది ముంబైలోనే కావడం విశేషం. వీళ్ళ నాన్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. కృతి శెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్. అంతేకాదు సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటి నటులు. అచ్చం అలాగే తనకు ఛాన్సులు వచ్చిన ప్రతి సినిమాలో కృతి శెట్టి చేస్తోంది. ఇది ఇలా ఉండగా కృతి శెట్టి నీ కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కాస్త ఇబ్బంది పెట్టాడట. తనతో గడిపితే ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు ఇప్పిస్తానని టార్చర్ చేశాడట. అయితే ఈ విషయం ఆమె కెరీర్ ప్రారంభంలో జరిగిందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు