Keerthi Bhat : దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ బ్యూటీ

Keerthi Bhat : టెలివిజన్ సీరియల్ యాక్టర్ కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్టర్ కీర్తి బిగ్ బాస్ తెలుగు షో ద్వారా బాగా పాపులర్ అయింది. అయితే అలాంటి బిగ్ బాస్ నటి కీర్తిభట్ దారణంగా మోసపోయింది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇవే విషయాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను చేసి డబ్బులు కాజేస్తున్నారు.

మనం కాస్త… లైట్ తీసుకుంటే చాలు జేబులన్నీ కాళీ చేస్తున్నారు సైబర్ నెరగాళ్లు. వీళ్ళకు… పేద ధనిక అలాగే రాజకీయ నాయకుడా, సినీ ప్రముఖుల అన్న తేడా లేదు. మోసం చేయాలనిపిస్తే ఎవరినైనా మోసం చేసేస్తారు సైబర్ నేరగాళ్లు. అయితే తాజాగా బిగ్ బాస్ నటి కీర్తి బట్ ( Keerthi Bhat ) సైబర్ నేరగాళ్ల చేతికి అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పష్టం చేసింది నటి కీర్తి.

నాకు ముఖ్యమైన కొరియర్ రావలసి ఉందని… వారం రోజులైనా కూడా అది రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకు ఫోన్ చేశానని కీర్తి వెల్లడించింది. అయితే వాళ్లు డెలివరీ చేసేసాం… మెహిదీపట్నంలో ఉందంటూ చెప్పారట. ఈ తరుణంలోనే ట్రాక్ చేసి చూస్తే నిజంగానే అది మెహదీపట్నంలో ఉన్నట్లుగా చూపించింది. కొద్దిసేపటికి తనకు ఒక కాల్ వచ్చిందని స్పష్టం చేసింది కీర్తి.

- Advertisement -

మీకు ఒక కొరియర్ రావాల్సి ఉంది కదా అంటూ వాళ్ళు అడిగారట.. ఈ తరుణంలోనే కీర్తి అడ్రస్ వాట్సప్ చేయమన్నారట. ఈ తరుణంలోనే కీర్తి వాట్సాప్ కు ఒక లింకు పంపారట ఆ సైబర్ నెరగాళ్లు. అయితే దాన్ని క్లిక్ చేయడంతో కీర్తి అకౌంట్లో ఉన్న రెండు లక్షలు మాయమైపోయాయి అంట. ఇప్పుడు ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ద్వారా తన ఫ్యాన్స్ కు తెలిపింది కీర్తి. తనలాగా ఎవరు కూడా మోసపోకూడదని చెప్పింది. ఇక ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని. వాడు దర్యాప్తు చేస్తున్నారని కీర్తి స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు