Vijay Deverakonda : ప్రమోషన్స్ పక్కన పెట్టి మరీ గర్ల్ ఫ్రెండ్‌తో అమెరికా టూర్

Vijay deverakonda : ఆన్ స్క్రీన్ మీద టాలీవుడ్ లో క్యూట్ జోడిగా పేరుపొందిన జంటలలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా ఒకటి. వీరిద్దరూ కేవలం రెండు చిత్రాలలో మాత్రమే నటించారు. అందులో ఒకటి గీతా గోవిందం. మరొకటి డియర్ కామ్రేడ్. ఈ రెండు చిత్రాలలో గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే డియర్ కామ్రేడ్ సినిమా ఈ జంటకు మంచి పేరు తీసుకువచ్చేలా చేసింది. డియర్ కామ్రేడ్ సినిమా నుంచే అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మధ్య ఏదో ఉందంటూ పలు రకాల రూమర్స్ అయితే ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.

రష్మిక కోసం ప్రమోషన్స్ ని ఎగ్గొట్టిన విజయ్..

ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో కూడా తనకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమని తెలియజేశారు. దీంతో అందరూ కూడా ఖచ్చితంగా రష్మికనే అయి ఉంటుందంటూ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ పరశురాం, విజయ్ దేవరకొండ ( Vijay deverakonda ), మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటారనుకుంటున్న విజయ్ దేవరకొండ.. సడన్గా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..

అందుకే అమెరికాకు..

అదేమిటంటే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ నే పక్కనపెట్టి ఏప్రిల్ రెండవ తేదీన అమెరికాకు వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ముంబై నుండి రష్మిక అమెరికా కూడా ఫ్లైట్ ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు గల కారణం ఏమిటంటే ఏప్రిల్ 5వ తేదీన రష్మిక బర్తడే సందర్భంగా వీరిద్దరూ అమెరికాలో ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక బర్తడే సందర్భంగా వీరిద్దరూ అమెరికాలో ఎంజాయ్ చేయబోతున్నట్లుగా సమాచారం. అందుకే రష్మిక కోసం సినిమా ప్రమోషన్స్ ని కూడా పక్కన పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు వీరిద్దరి లవ్ ఎఫైర్ ను కన్ఫామ్ చేస్తున్నారు కూడా..

- Advertisement -

ఇప్పటికైనా కన్ఫామ్ చేస్తారా..?

అయితే ఇప్పటివరకు వీరిద్దరూ అధికారికంగా లవ్ లో ఉన్నట్టుగా తెలియజేయలేదు. కానీ అప్పుడప్పుడు ఒకే కలర్ దుస్తులు, ఒకే చోట ఉన్నట్టుగా ఫోటోలు వంటివి పెట్టడం వల్ల ఇప్పటికి అభిమానులకు వీరిద్దరి మీద సందేహంగానే ఉంటుంది.. మరి ఈ ఏడాదైనా వీరిద్దరి మధ్య ఉండే ప్రేమను తెలియజేసి.. పెళ్లి పీటలు ఎక్కుతారేమో చూడాలి మరి. చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఫ్యామిలీ స్టార్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రష్మిక సినిమాలు..

రష్మిక విషయానికి వస్తే.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించుకుంది.. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో యానిమల్ మూవీలో నటించి మరొకసారి స్టార్ డం ని అందుకుంది.. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతోపాటు పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది రష్మిక. మరి రష్మిక, విజయ్ దేవరకొండ పైన వస్తున్న ఈ వార్తల పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు