Work Management : పని భారంతో పెరిగే ఒత్తిడి తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Work Management :  ఈ డిజిటల్ యుగంలో జనాలు ఆఫీస్ వర్క్ తో బిజీబిజీగా గడిపేస్తున్నారు. తమకోసం, తమ కుటుంబాల కోసం సమయాన్ని స్పెండ్ చేయలేకపోతున్నారు. చాలాసార్లు ఆఫీసులో పని భారం పెరగడంతో ఒత్తిడి, అలసట వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా వీటిని పెద్ద సమస్యలుగా పరిగణించరు. కానీ ఒత్తిడి, అలసట వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పని చేస్తున్న సమయంలో ఒత్తిడికి గురి కావడం వల్ల మానసిక ఆరోగ్యం పై డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆఫీసులో వర్క్ చేయడం, ఇల్లు, కుటుంబం, ఆరోగ్యాన్ని చూసుకోవడం కష్టంగా మారుతుంది. మరి ఈ ఒత్తిడిని పెంచే పని భారాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మరి ఒత్తిడిని తగ్గించే ఆ టిప్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

1. పంక్చువాలిటి

ఆఫీస్ టైంలో పెరిగే పని భారం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనను నివారించడానికి టైం మేనేజ్మెంట్ (Work Management) స్కిల్స్ ను నేర్చుకోవడం ముఖ్యం. మీరు చేయాలనుకుంటున్న పనిని, చేయవలసిన పనులను షెడ్యూల్ చేయడం వల్ల టెన్షన్ తగ్గుతుంది. దీంతో పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఆఫీస్ వర్క్, పర్సనల్ లైఫ్ కు సరిగ్గా సమయాన్ని కేటాయించగలుగుతారు. కాబట్టి అత్యంత ముఖ్యమైన పనులను గుర్తించి ముందుగా వాటిని పూర్తి చేయండి. మీరు చేసే ప్రతి పనికి టైంను సెట్ చేసుకోండి. ఏ టైంకు పనిని పూర్తి చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అలారం సెట్ చేసుకోవడం బెటర్.

2. బ్రేక్

బ్రేక్ అనేది మిమ్మల్ని రీఛార్జ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల పనిపై ఫోకస్, ప్రాడక్టివిటీ కూడా పెరుగుతుంది. పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవడం మంచిది. భోజనం చేసిన తర్వాత స్నేహితులతో మాట్లాడడం, లేదా కాసేపు వాకింగ్ చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఆఫీస్ నుంచి సెలవు తీసుకొని కొన్ని రోజులు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గిపోతాయి. ఆ తర్వాత రీఫ్రెష్ గా వర్క్ ను స్టార్ట్ చేయగలుగుతారు.

- Advertisement -

3. మాటలు కలపండి

విశ్రాంతి తీసుకోవాలంటే మధ్య మధ్యలో ఎవరితోనైనా కాసేపు మాట్లాడుతూ ఉండండి. మీ సమస్యలు లేదా ఆలోచనలను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి కూడా తగ్గిపోతాయి.

4. ఎంటర్టైన్మెంట్

సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడాలనుకుంటే సెలవు రోజుల్లో ఆ పనిని పెట్టుకుంటే సరదాగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే పాటలు వినడం వంటి హాబీ కూడా మెంటల్ గా మిమ్మల్ని రిఫ్రెష్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

5. సెల్ఫ్ కేర్

మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా సరిగ్గా నిద్రపోవాలి. నిద్రపోతున్నప్పుడు ఒత్తిడి, అలసట తగ్గి శరీరానికి బాగా రెస్ట్ దొరుకుతుంది. అందుకే ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఒకవేళ సరిగ్గా నిద్ర పోకపోతే అది కచ్చితంగా మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా రోజంతా నిద్ర ముఖంతో అలసటగా, చిరాగ్గా ఉంటారు. ఆరోగ్యకరమైన నిద్ర, ఆహారంతో పాటు ప్రతిరోజూ ఉదయం లేవగానే 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం, వ్యాయమం చేయడానికి ట్రై చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు