Allu Arjun: అల్లు అర్జున్, స్నేహారెడ్డి మధ్య గొడవలు!

Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలు చాలామంది ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రాణిస్తున్నారు. ఆ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎవరు అవునన్నా కాదన్నా… మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా… అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని చెప్పవచ్చు. అల్లు రామలింగయ్య వారసత్వంతో… మెగాస్టార్ చిరంజీవి అండాదండలతో మొదటి నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అల్లు అర్జున్.

అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ… ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. గంగోత్రి సినిమా నుంచి ఇప్పటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో బంపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బన్నీ ( Allu Arjun ) చేసిన సినిమాలలో 95% అన్ని హిట్ సినిమాలు కావడం విశేషం. ముఖ్యంగా పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు.

ఇక అటు అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అల్లు అర్జున్ కు కూడా ఉంది. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడుతోంది ఈ మధ్యకాలంలో…! ఇక ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో కాస్త గ్లామర్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ట్రెడిషన్ డ్రెస్సులు, మోడల్ డ్రెస్సులు వేసుకొని యూత్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.

- Advertisement -

దీంతో స్నేహ రెడ్డి టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆమెకు హీరోయిన్గా చేయడం అస్సలు ఇష్టం లేదట. ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి మధ్య కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయట. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా కామన్. కానీ వీరిమధ్య జరిగిన విభేదాలను పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో ఎత్తి చూపిస్తున్నారు కొంత మంది. వాస్తవానికి అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి మధ్య తమ పిల్లల గురించి గొడవ స్టార్ట్ అయిందట.

తన పిల్లలను అల్లు అర్జున్ చాలా గారాబం చేస్తాడట. అయితే పిల్లలను గారభం చేస్తే పెద్ద అయ్యాక అస్సలు మన మాట వినరని స్నేహ రెడ్డి నిత్యం చెబుతూ ఉంటారట. అల్లు అర్జున్ ను కూడా గారాబం చేయకుండా… స్ట్రిక్ట్ గా ఉండాలని స్నేహ రెడ్డి చెబుతూ ఉంటారట. అయినప్పటికీ అల్లు అర్జున్ అస్సలు వినడట. దీంతో స్నేహ రెడ్డి మరియు అల్లు అర్జున్ మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయట. అంతేకానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద విభేదాలు జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు