DJ Tillu 3 : మరో సీక్వెల్ కూడా ఉంటుందా?

DJ Tillu 3 : “టిల్లు స్క్వేర్” మూవీ పోస్టర్ తోనే అందరిని అట్రాక్ట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ లతో సినిమాపై ఊహించిన దాని కంటే ఎక్కువే బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టించిన ఈ మూవీ ఎలా ఉంది? పార్ట్ 3 కూడా ఉండబోతుందా? అంటే…

“డీజే టిల్లు” పార్ట్ 3 కూడా ఉంటుందా?

డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశాడు. తాజాగా డీజే టిల్లు కు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మూవీతో థియేటర్లలోకి వచ్చేసాడు. మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన “టిల్లు స్క్వేర్”కు పాజిటివ్ టాక్ నడుస్తోంది. డీజే టిల్లు రేంజ్ లో ఇల్లు స్క్వేర్ ఇంప్రెస్ చేయలేకపోయింది. అలాగని తక్కువ కూడా కాదు. మొత్తానికి రెండు గంటల పాటు ఎంటర్టైన్ అవ్వాలంటే థియేటర్ కు వెళ్లి ఈ సినిమాను చూడాల్సిందే. ఈ నేపథ్యంలోనే దీనికి మూడవ సీక్వెల్ కూడా ఉంటుందా? అనే అనుమానం మొదలైంది. ఈ అనుమానానికి మేకర్స్ తెరదించుతారేమోనని ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలోకి అడుగుపట్టారు జనాలు. కానీ చిత్ర బృందం మాత్రం మూడవ పార్ట్ విషయంలో సస్పెన్స్ ను అలాగే కంటిన్యూ చేశారు. మొదటి భాగం క్లైమాక్స్ ఎలా ఉంటుందో టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ ను కూడా అలాగే డిజైన్ చేశారు. దీంతో డీజే టిల్లు పార్ట్ 3 ( DJ Tillu 3 ) ఉంటుందా ఉండదా అని కన్ఫ్యూజన్ మొదలైపోయింది. కానీ తాజా సమాచారం ప్రకారం పార్ట్ 3 కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇదే బ్యానర్ పై మరో సీక్వెల్…

టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన విషయం తెలిసిందే. సిద్దు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇదే బ్యానర్ లో ఉండబోతుందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది కచ్చితంగా డీజే టిల్లు పార్ట్ 3 అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేశాక సిద్దు టిల్లు మూడో పార్ట్ షురూ చేయబోతున్నాడని సమాచారం. అన్ని అనుకున్న విధంగా జరిగితే 2025 ద్వితీయార్థంలో డీజే టిల్లు పార్ట్ 3 షూటింగ్ ప్రారంభమవుతుంది. సిద్దు అప్పట్లోపు తన ప్రాజెక్ట్ లు అన్ని పూర్తి చేసి, పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాడని అంటున్నారు. అలాగే దర్శకుడిని కూడా త్వరలోనే ఖరారు చేస్తాడని, మూడో భాగానికి రామ్ మిర్యాల సంగీతం అందించనున్నారని ప్రచారం జరుగుతుంది. డీజే టిల్లు మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా, టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చింది. మరి మూడవ భాగాన్ని ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు