Kasthuri Shankar : మహేష్‌ బాబుపై మోజు పడుతున్న నటి కస్తూరి ?

Kasthuri Shankar : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే హీరోలు పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది హీరోలు తమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎదుగుతూ ఉంటారు. మరికొంతమంది తమ సొంత టాలెంట్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అయితే తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు హీరోలు. అలాంటి హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు ఒకరు.

హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో ఎదిగారు మహేష్ బాబు. తన కెరీర్ ప్రారంభంలో కృష్ణ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు మహేష్ బాబు. ఆ తర్వాత రాజకుమారుడు, పోకిరి, మురారి, లాంటి సినిమాలతోనే 10 సంవత్సరాల కింద బంపర్ హిట్స్ అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఈమధ్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ బంపర్ విజయాలను అందుకుంటున్నాడు మహేష్ బాబు.

మొన్న ఈమధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేశాడు మహేష్ బాబు. ఈ సినిమా కూడా భారీగానే కలెక్షన్లను రాబట్టగలిగింది. ఇది ఇలా ఉండగా ప్రిన్స్ మహేష్ బాబు పై నటి కస్తూరి మోజు పడ్డట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో కస్తూరి మెరిసిన సంగతి తెలిసిందే. అంతకుముందు సినిమాలలో కూడా కీలక పాత్రలు చేసేది ఈ బ్యూటీ. అంతేకాదు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది కస్తూరి శంకర్.

- Advertisement -

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కస్తూరి మహేష్ బాబు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు జోడిగా చేయాల్సిన వయసు తనది అంటూ పేర్కొన్నారు నటి కస్తూరి. తల్లి పాత్రలో నటించాలంటే ఇంకో 30 సంవత్సరాలు ఆగాలంటూ పేర్కొన్నారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మరి యంగ్ అయిపోయానని తీసేసారంటూ మరో బాంబు పేల్చారు నటి కస్తూరి. అటు రజనీకాంత్ సరసన కూడా యంగ్గా కనిపిస్తానని ఆయన సినిమాలో కనిపించకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. నటి కస్తూరి ఓవర్గా మాట్లాడుతుందని… ఒకసారి అద్దం ముందు ముఖం చూసుకోవాలని చురకలాంటిస్తున్నారు. ఆశకు హద్దు ఉండాలి అంటూ మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు