Kasturi Shankar: ఆ టాలీవుడ్ స్టార్ హీరో టార్చర్ చేశాడు – నాగ్ బ్యూటీ..!

కస్తూరి శంకర్.. ఈ పేరు చెప్పగానే నాగార్జున నటించిన అన్నమయ్య సినిమా గుర్తుకొస్తుంది.. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో, అందంతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. రమ్యకృష్ణతో పాటు నాగార్జున తో కస్తూరి శంకర్ ఆడి పాడింది.. ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే బాలయ్య సరసన నిప్పురవ్వ సినిమాలో కూడా నటించింది.. అలా ఒకటి రెండు సినిమాలలో మెరిసిన కస్తూరి శంకర్ ఆ తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైంది.. చాలా సంవత్సరాలు విరామం తీసుకుని ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యింది.. ఇందులో తులసి పాత్రతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరుస కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఎలాంటి విషయం పైన అయినా సరే నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని బయటపెడుతూ ఒక్కొక్కసారి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.. రీసెంట్ గా పూనం పాండే వ్యవహారంపై ఘాటుగా స్పందించింది.. ఆమె నిజంగా మరణించినా అది పెద్ద వార్త కాదు అంటూ మండిపడింది.. అలాంటి ఈమె తాజాగా ఒక తెలుగు స్టార్ హీరోని ఉద్దేశించి కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది..

కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. నాకు ఒకేసారి మూడు పెద్ద సినిమాలకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది.. అయితే ఒక స్టార్ హీరో వల్ల వాటి నుంచి తప్పించారు. అదే హీరోతో నా మూడు సినిమాలకు కాల్ షీట్ తీసుకున్నారు.. అయితే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ హీరో నన్ను దారుణంగా టార్చర్ చేశాడు.. ఆఫర్ల కోసం , డబ్బు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు నేను అని చెప్పాను.. తాము చెప్పినట్టు వినకపోతే మిగతా ప్రాజెక్టుల నుంచి తీసివేస్తామన్నారు.. పర్వాలేదు అన్నాను.. దాంతో మిగతా ప్రాజెక్టుల నుంచి నన్ను తీసేశారు.. అయితే టార్చర్ అనుభవించి కూడా ఆ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అయింది.. మంచి పేరు వచ్చింది .. కానీ వారు పెట్టే టార్చర్ భరించలేక మిగతా సినిమాల నుంచి తప్పుకున్నాను..

ఎందుకంటే పైకి నవ్వుతూ పలకరించడం నావల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది.. అయితే ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం రిలీజ్ చేయలేదు ఈ ముద్దుగుమ్మ.ఇక కస్తూరి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. ఇకపోతే కస్తూరి శంకర్ ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చాలా చేసింది అప్పుడు కూడా హీరో పేరు చెప్పలేదు.. ఇప్పుడు మళ్లీ కామెంట్లు చేయడంతో మరొకసారి వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ కామెంట్స్ విన్న నెటిజన్లు ఆ హీరో నందమూరి బాలకృష్ణ అయ్యుంటాడంటూ అభిప్రాయపడుతున్నారు.. ఇక ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే బాలయ్య సరసన నటించిన నిప్పురవ్వ సినిమా మంచి హిట్ అయింది.. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.. అయితే బాలయ్యని అనడానికి కూడా కారణం వుంది.. ఎందుకంటే గతంలో రాధిక ఆప్టే, విచిత్ర లాంటి హీరోయిన్లు కూడా బాలకృష్ణ తమను ఇబ్బంది పెట్టాడంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.. మరీ ఈమె బాలయ్యను ఉద్దేశించే ఇలా మాట్లాడిందా అని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి నెటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్లు నిజమో కాదో తెలియాలి అంటే కస్తూరి మళ్ళీ స్పందించక తప్పదు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు