Siddhu Jonnalagadda :14 ఏళ్లకు అదే డైరెక్టర్ తో రెండోసారి.. ఈసారి హీరోగా?

Bommarillu bhasker

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోల్లో ఒకరు “సిద్ధూ జొన్నలగడ్డ”. చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీ కి వచ్చిన ఈ గ్లామర్ బాయ్ డీజే టిల్లు తో ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చుకున్నాడు. ఇక వరుస సినిమాలతో ఇప్పుడు బిజీ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా సిద్ధూ జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ గా పలు కొత్త సినిమాల అనౌన్స్ మెంట్స్ కూడా అయ్యాయి. ఆ సినిమాల్లో SVCC బ్యానర్ సినిమా కూడా ఒకటి. ఈ బ్యానర్ లో చేస్తున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ మేకర్స్ అఫిషియల్ గా టైటిల్ తో సహా రిలీజ్ చేసారు. “జాక్” అనే పేరుతో సినిమా తెరకెక్కుతుంది. బహుశా హీరో పేరే జాక్ అయి ఉండవచ్చు.

ఇక ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ ఇంతకు ముందే నటించాడన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అవును.. అయితే అది హీరో గా కాదు. సినిమాలో ఓ కీలక పాత్ర. ఆ సినిమా ఏదో కాదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా. అవును.. ఈ సినిమాలో సిద్ధూ హీరోయిన్ జెనీలియా ని ప్రేమించే ముగ్గురు అబ్బాయిల్లో సిద్ధార్థ్ గా నటించాడు. అయితే చాలా మంది అప్పట్లో సిద్ధుని సినిమాలో గుర్తించలేదు. ఎందుకంటే ఈ సినిమాలో సిద్ధూ వాయిస్ కూడా ఇప్పట్లా ఉండదు.

- Advertisement -

అయితే ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యాక మాత్రం చాలా మంది సిద్ధూ ని సినిమాలో చూసి షాక్ అయ్యారు. ఏది ఏమైనా ఇన్నాళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడంటే ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉంటుందా అని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న జాక్ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు