Parenting Tips : మీ పిల్లలకు ఫెయిల్యూర్ ను ఇలా ఎదుర్కోమని చెప్పండి

Parenting Tips : ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కు తొలిమెట్టు అనే మాటను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంటారు. ఈ వైఫల్యాలే మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతాయి. కానీ చిన్నపిల్లలు ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే నిరాశకు గురవుతారు. వాళ్లు ఫెయిల్యూర్ కామన్ అనే విషయాన్ని తెలుసుకొని కాన్ఫిడెంట్ గా ఎదగాలంటే తల్లిదండ్రులు ఫెయిల్యూర్ ను ఎలా ఎదుర్కోవాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి. కానీ చాలామంది పేరెంట్స్ కు ఈ విషయాన్ని పిల్లలకు ఎలా వివరించాలి, ఎలా నేర్పించాలి అనే విషయం తెలీదు. అలాంటి వాళ్ల కోసమే ఈ టిప్స్.

మరో అవకాశం…

పిల్లల ఎదుగుదలను ప్రోత్సహించడమే తల్లిదండ్రుల ముఖ్యమైన పని. ఫెయిల్యూర్ అనేది కొత్త అవకాశాలకు నిచ్చెన వంటిదని పిల్లలకు బోధించండి. ఫెయిల్ అయ్యామని ఏడవడం కంటే దాన్ని విశ్లేషించి, తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించి, మరోసారి ఆ తప్పు జరగకుండా ముందుకు సాగడం ముఖ్యమని వాళ్లకు అర్థమయ్యేలా చేయండి.

ఫెయిల్యూర్ మామూలే

ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఫెయిల్యూర్ ను రుచి చూడాల్సిందే అనే విషయాన్ని పిల్లలకు చెప్పండి. జీవితంలో సక్సెస్ మాత్రమే ఉండదని, ఫెయిల్యూర్ సహజమని, దాని వల్ల ఎన్నో లైఫ్ లెసన్స్ ను నేర్చుకోవచ్చని తెలియజేయండి. ప్రపంచంలో ఎంతోమంది సక్సెస్ ఫుల్ పీపుల్ తమ జీవితాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ ను చూశారని ఉదాహరణలతో సహా వారికి వివరించండి.

- Advertisement -

ఫెయిల్యూర్ ను అంగీకరించాలి

వైఫల్యాన్ని ఎలా అంగీకరించాలో పిల్లలకు నేర్పించండి. ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అయినందుకు పిల్లలను ఎప్పుడూ నిందించవద్దు. దాని బదులు వాళ్లు సక్సెస్ అవ్వడానికి అవసరమయ్యే సూచనలు ఇవ్వండి. ఫలితంగా మీరిచ్చే ఈ సపోర్ట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వెనక్కి తగ్గకుండా పిల్లలు తాము చేసే ప్రయత్నాలను కొనసాగించడానికి ఎంకరేజ్ చేస్తుంది.

పట్టుదల

అడ్డంకులను అధిగమించడానికి, ఫెయిల్యూర్ ను ఎదుర్కోవడానికి పట్టుదల ముఖ్యమనే విషయాన్ని పిల్లలకు చెప్పండి.

స్వేచ్ఛగా ఆలోచించనివ్వండి

పిల్లలను స్వేచ్ఛగా చాలెంజెస్ ను స్వీకరించనివ్వండి. అదే సమయంలో వారికి మీ సపోర్ట్ కూడా అవసరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగమని, ఫెయిల్ అయినప్పుడే తప్పుల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటారని పిల్లలకు అర్థమయ్యేలా చేయండి.

ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్

ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ను పెంపొందించుకునేలా పిల్లలను ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. మీ పిల్లలు ఎక్కడ తప్పు చేశారు అనే విషయాన్ని తెలియజేసి, నెక్స్ట్ టైం ఆ తప్పును రిపీట్ కాకుండా ఎలా చూసుకోవాలో వారికి నేర్పండి. పిల్లలను మీ ఆధ్వర్యంలో సమస్య పరిష్కారం నైపుణ్యాలను పెంపొందించుకునే దిశగా ఆలోచించనివ్వండి.

రోల్ మోడల్ గా ఉండండి

మీ పిల్లలకు మీరే రోల్ మోడల్ గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే చాలా విషయాలను నేర్చుకుంటారు. కాబట్టి ముందుగా సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా అంగీకరించాలి అనే విషయాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు నేర్పించాలి.

శ్రమను వృధా కానివ్వకండి

పిల్లల ప్రయత్నాలు ఫెయిల్ అయినప్పటికీ, వాళ్ళు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా వారి ప్రయత్నాన్ని గుర్తించి సెలబ్రేట్ చేయండి. అభినందించండి. దీంతో పిల్లల్లో పట్టుదల పెరిగి, మరో కొత్త ప్రయత్నం చేయడానికి ఆసక్తి పెరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు