Mood Swings : అమ్మాయిల్లో మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయో తెలుసా?

Mood Swings : కొన్నిసార్లు కారణమే లేకుండా ఒత్తిడికి గురవుతాము. మరికొన్నిసార్లు అనవసరంగా చిరాకు, కోపం వచ్చేస్తుంటాయి. దీన్నే మూడ్ స్వింగ్స్ అంటారు. ఈ మూడ్ స్వింగ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సంతోషంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కోప్పడతారు. కారణం లేకుండా చిరాకుపడతారు. అంటే క్షణంలోనే ఎమోషన్స్ మారిపోతాయి. అలసట, నిద్రలేమి, విపరీతమైన చిరాకు, కోపం, విచారంగా ఉండటం, పనిపై ఆసక్తి లేకపోవడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మూడు స్వింగ్స్ మహిళలకు ఎందుకు వస్తాయి? సాధారణంగా మూడు స్వింగ్స్ ను తేలికగా తీసుకుంటారు. కానీ ఇది ప్రమాదం అనే విషయాన్ని మర్చిపోతారు. సడన్ గా మారే ఎమోషన్స్ వల్ల అవతలి వాళ్ళు బాధపడవచ్చు. కొన్నిసార్లు కోప్పడొచ్చు. అది మీ రిలేషన్ పై ఎఫెక్ట్ చూపించొచ్చు. మూడ్ స్వింగ్స్ అనేది మానసిక సమస్య. మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణం లేదు. కానీ చాలామంది ఆరోగ్య నిపుణులు హార్మోన్లు, న్యూరోట్రాన్స్మిటర్ల కారణంగా ఇలా జరుగుతుందని అంటారు. ప్రెగ్నెన్సీ, పీరియడ్స్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ వంటి ఇతర అనేక హార్మోన్ల మార్పుల కారణంగా మహిళల్లో మూడ్ స్వింగ్స్ అనే సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంది.

అబ్బాయిల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే మూడ్ స్వింగ్స్ ( Mood Swings ) ను ప్రేరేపించే ఇతర కారకాలు నాడీ వ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగించే వ్యాధులను తెచ్చి పెడతాయి. అందులో భాగంగానే ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతుంది. నిరాశగా అనిపిస్తుంది. నిద్రలేమి మొదలవుతుంది. అనారోగ్యకరమైన ఆహారం, లైఫ్ స్టైల్, మందు, పొగ తాగడం వంటి అలవాట్లు దీన్ని మరింత పెంచుతాయి. ఇక మూడ్ స్వింగ్స్ ను కంట్రోల్ చేయడానికి ఇప్పటిదాకా ఎలాంటి మెడిసిన్ రాలేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మూడ్ స్వింగ్స్ ను కంట్రోల్లో పెట్టొచ్చు.

- Advertisement -

మూడ్ స్వింగ్స్ ను ఎలా కంట్రోల్ చేయాలంటే? 

1. ఫ్రెండ్స్ తో ఎమోషన్స్ ను షేర్ చేసుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసులో ఉన్నదంతా బయటకు చెప్పేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

2. మూడ్ స్వింగ్స్ తో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తే ప్రశాంతతను వెతకండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో ఆ పనిని మాత్రమే చేయండి. ఎవరితో ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్లతోనే ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయండి.

3. ప్రకృతితో మమేకం కావాలి. కాసేపు వాకింగ్ చేయడం, సంగీతం వినడం, హెర్బల్ టీ తాగడం వంటివి మానసిక కల్లోలాన్ని తగ్గిస్తాయి.

4. ఆల్కహాల్, కెఫిన్ వంటి వాటికీ దూరంగా ఉండండి. వీటివల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది. దీంతో మూడ్ స్వింగ్స్ మరింత ఎక్కువవుతాయి.

4. తగినంత నిద్రపోవాలి. కనీసం 7 గంటల నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి.

5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మూడ్ స్వింగ్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే వ్యాయామం చేసినప్పుడు మెదడులో ఎండార్పిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని కలిగిస్తాయి.

6. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. ప్రతిరోజూ ఆహారంలో రకరకాల పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. అలాగే భోజనంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.

7. నెగిటివిటీకి దూరంగా ఉండండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలావరకు మూడ్ స్వింగ్స్ ను కంట్రోల్ చేయగలుగుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు