Om Bheem Bush : శ్రీవిష్ణు చెప్పినట్టుగానే ఆ యూనిక్ పాయింట్ ఉందా?

Om Bheem Bush : యంగ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన “ఓం భీమ్ బుష్” మూవీ ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. హుషారు ఫేమ్ డైరెక్టర్ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ శ్రీ విష్ణు గత మూవీ సామజవరగమన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో “ఓం భీమ్ బుష్”పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే బ్రోచేవారెవరురా అనే మూవీలో నటించిన ట్రియో మరోసారి “ఓం భీమ్ బుష్” అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవ్వడం కూడా హైప్ ను పెంచేసింది. ఇక మూవీ ప్రమోషన్లలో శ్రీవిష్ణు సెకండ్ హాఫ్ లో ఊహించని ట్విస్ట్ తో ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ ఉంటుంది అంటూ ఊరించారు. మరి ఇంతకీ ఆయన చెప్పినట్టుగా మూవీలో ఆ యూనిక్ పాయింట్ ఉందా? ఉంటే ఏంటది? అంటే…

మూవీలో ఇదే యూనిక్ పాయింట్?

సినిమాలో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, హిలేరియస్ గా ఉంటుందని ప్రమోషన్లలో చిత్ర బృందం చెప్తూ వచ్చింది. కానీ మూవీ స్టార్టింగ్ అంతా గందరగోళంగా అనిపిస్తుంది. వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కొంతమందికి చిరాకు తెప్పించొచ్చు. ఫస్ట్ హాఫ్ ను భరించడం కష్టంగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా దాదాపుగా బోర్ కొడుతుంది. కానీ దెయ్యం ఎంటర్ అయ్యాక మాత్రం స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక్కడ రొటీన్ హారర్ ఫిల్మ్ లా కాకుండా ఆ దెయ్యం ట్రాక్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్. దెయ్యం ఫ్లాష్ బ్యాక్ శ్రీ విష్ణు ప్రమోషన్లలో చెప్పిన విధంగానే యూనిట్ గా అనిపిస్తుంది. సినిమా మొత్తానికి ఇదే హైలెట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా చెప్పుకోదగ్గ విధంగా ఏమి లేకపోయినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం అదరగొట్టారు. శ్రీవిష్ణు చెప్పినట్టుగానే యూనిక్ పాయింట్ తో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మాటను నిలబెట్టుకున్నారు. కమర్షియల్ గా ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ రాబడుతుందనేదే ఆసక్తికరంగా మారింది.

మూవీలో కామెడీనే అతి పెద్ద మైనస్…

క్రిష్, వినయ్, మ్యాడి అనే ముగ్గురు స్నేహితులు “బ్యాంగ్ బ్రోస్” అనే సంస్థను స్థాపిస్తారు. భైరవపురంలో తాంత్రిక విద్యల పేరుతో కొందరు డబ్బు సంపాదించడం చూసి, దానికి సైన్స్ ను అప్లై చేసి జనాలను ఆకట్టుకుంటారు. అయితే తాంత్రిక విద్యలు చేసే బ్యాచ్ వీళ్ళపై కోపంతో సంపంగి మాల్ లో ఉన్న దెయ్యాన్ని బంధించి, అందులోని నిధి బయటకు తీసుకురావాలని వీళ్లకు చాలెంజ్ విసురుతారు. నిధి కోసం టెంప్ట్ అయ్యి ఆ భవనంలోకి వెళ్లిన ఈ ముగ్గురు మిత్రులకు ఏం జరుగుతుంది? వాళ్లు నిధిని తీసుకురాగలిగారా? ఆ దయ్యం నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేదే స్టోరీ. సినిమాకు క్లైమాక్స్, ముఖ్యంగా దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తో పాటు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కామెడీనే అతిపెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. సిల్లీ కామెడీ ట్రాక్స్, ఫోర్స్డ్ కామెడీ, ఫస్ట్ హాఫ్ మైనస్ పాయింట్స్. మరి మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, శ్రీ విష్ణు “ఓం భీమ్ బుష్” (Om Bheem Bush ) మూవీతో మ్యాజికల్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్టేనా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు