Om Bheem Bhush : “ఓం భీమ్ బుష్”కు బిగ్ అడ్వాంటేజ్

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ కలిసి నటించిన లేటెస్ట్ కామెడీ హార్రర్ మూవీ “ఓం భీమ్ బుష్”. తాజాగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఈ మూవీకి మంచి అడ్వాంటేజ్ మాత్రం ఉంది. దాన్ని ఉపయోగించుకుంటే ఈసారి శ్రీవిష్ణు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి ఇంతకీ “ఓం భీమ్ బుష్” మూవీకి ఉన్న ఆ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

“ఓం భీమ్ బుష్”కు ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్…

గతంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ బ్రోచేవారెవరురా అనే సూపర్ హిట్ మూవీలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మంచి విజయాన్ని అందుకోవడంతో. ఇదే కాంబోలో తాజాగా థియేటర్లోకి వచ్చేసిన “ఓం భీమ్ బుష్” మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది లాజిక్ లేకపోయినా నవ్వించే మ్యాజిక్ అయితే ఉందని అంటుంటే, మరి కొంత మంది మాత్రం సినిమాలో క్లైమాక్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటున్నారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీని సునీల్ బలుసు నిర్మించారు. ఇక ఈ హార్రర్ మూవీకి కలిసి వచ్చే అంశం ఏమిటంటే ప్రస్తుతం ఎగ్జామ్స్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే. మార్చ్ 21తో అంటే సినిమా రిలీజ్ కావడానికి ఒక రోజు ముందే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. మార్చ్ 22 నుంచి వాళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇక “ఓం భీమ్ బుష్” మూవీ మార్చ్ 22న అంటే శుక్రవారం రోజు థియేటర్లోకి వచ్చింది. ఈ మండే అంటే మార్చి 25న హోలీ పండుగ ఉంటుంది. పండుగతో కలిపి ఈ లాంగ్ వీకెండ్ శ్రీ విష్ణు టీంకు కలిసి వచ్చే మరో అంశం కాబోతోంది. మొత్తానికి ఇంటర్ సెలవులు, హోలీ పండగ “ఓం భీమ్ బుష్”కు కలిసి వచ్చిన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే ఈ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కారణంగా “ఓం భీమ్ భీమ్” మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

యావరేజా? హిట్టా?

ఇక ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉందంటే… ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగా, భరించడం కష్టమనిపించే కామెడీ ట్రాక్ లతో నడిపించారు. ఇంటర్వెల్ బ్లాక్ పర్లేదు. సెకండ్ హాఫ్ కూడా బోరింగ్ గానే సాగినప్పటికీ, దెయ్యం ఎంటర్ అయ్యాక మ్యాజిక్ మొదలవుతుంది. ఇక్కడే డైరెక్టర్ తన తెలివితేటలు వాడి క్లైమాక్స్ తో ప్రేక్షకుల ఎమోషన్ ను పట్టేసాడు. అందరికీ సింపతి కలిగేలా, దెయ్యం ట్రాక్ ను యూనిక్ గా తెరకెక్కించాడు. ఇక ప్రేక్షకులకు ఈ సినిమాలో కనెక్ట్ అయ్యే అంశాల్లో మీమ్ కంటెంట్ ఒకటి. మూవీ కొత్తగా ఏమీ అనిపించకపోయినా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కోసం ఒకసారి చూడొచ్చు. మొత్తానికి రివ్యూల పరంగా మూవీ యావరేజ్. కానీ ప్రేక్షకుల తీర్పును బట్టి ఈ మూవీ హిట్ అవుతుందా? లేదంటే యావరేజ్ గా నిలుస్తుందా అనేది తేలనుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు