Nithiin : నితిన్ బర్త్ డేకు డబుల్ బొనాంజా రెడీ

ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ కోసం కష్టపడుతున్న మిడ్ రేంజ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు. ఇటీవల కాలంలో కంటిన్యూగా డిజాస్టర్లు అందుకుంటున్న ఈ హీరో వరస ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. మరికొన్ని రోజుల్లో రాబోతున్న నితిన్ పుట్టిన రోజున ట్రీట్ గా అభిమానులకు డబుల్ బొనాంజా ఇవ్వబోతున్నారు మేకర్స్. మరి నితిన్ బర్త్ డే ట్రీట్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

బర్త్ డే ట్రీట్ గా డబుల్ బొనాంజా…

యంగ్ హీరో నితిన్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే 2020 తర్వాత ఈ హీరోకు లక్ అనేదే కనిపించకుండా పోయింది. అప్పట్లో భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా 5 సినిమాలు చేశాడు. అయినప్పటికీ నితిన్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రీసెంట్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ థియేటర్లలోకి వచ్చి మళ్లీ బొక్క బోర్లా పడ్డాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో నితిన్ పుట్టినరోజు కానుకగా రెండు సినిమాల అప్డేట్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ ట్రీట్ గా ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “రాబిన్ హుడ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక మరో ట్రీట్ ఏంటంటే నితిన్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్. ఈ రెండు అప్డేట్స్ తో నితిన్ అభిమానులను సర్ప్రైజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట నితిన్ తో సినిమాలు చేస్తున్న మేకర్స్. కాగా ఈ రెండు అప్డేట్స్ రావాలంటే నితిన్ బర్త్ డే డేట్ మార్చ్ 30 దాకా ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

నితిన్ సినిమాలు విషయానికి వస్తే…

నితిన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరో సినిమాను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. నితిన్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “తమ్ముడు” అనే మూవీ రూపొందుతోంది. సిస్టర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. వర్ష బొల్లమ్మ కీ రోల్ ప్లే చేస్తోంది. సీనియర్ నటి లయ ఈ మూవీలో నితిన్ అక్కగా కనిపించబోతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు “రాబిన్ హుడ్” అనే మూవీలో నటిస్తున్నాడు నితిన్. తనకు “భీష్మ” వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరోసారి “రాబిన్ హుడ్” అంటూ ప్రేక్షకుల మనసులను దోచేయడానికి రెడీ అయిపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో నితిన్ దొంగగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే “రాబిన్ హుడ్” నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో నితిన్ నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయబోతున్నారు. ఇదే నితిన్ బర్త్ డే క సంబంధించిన మరో ట్రీట్. గతంలో వీరిద్దరి కాంబోలో “ఇష్క్” అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు