Anushka: జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న అనుష్క శెట్టి ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పుడెప్పుడో సూపర్ సినిమా సమయంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ అనుష్క శెట్టి… ఇప్పటికీ టాప్ మోస్ట్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

నగరి నుంచి బరిలో ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు.. పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఎలాగైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కంకణం కట్టుకున్నాయి. అటు సింగిల్ గా సింహం లాగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ జనసేన పార్టీలో చేరి నగరి నియోజకవర్గ నుంచి పోటీ చేయబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీని వెనుక పెద్ద కారణమే ఉంది. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కీలక నేత రోజా. ఆమె ప్రస్తుతం ఏపీలో పర్యటకశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.

రోజా చాలాసార్లు.. పవన్ కళ్యాణ్ ను దారుణంగా తిట్టారు. అయితే రోజాపై రివేంజ్ తీర్చుకోవడానికి జనసేన నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారట. హీరోయిన్ అనుష్క శెట్టి ని బరిలోకి దింపేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు ఆమెతో కూడా చర్చలు చేశారట. దానికి అనుష్క శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అన్ని ఓకే అయితే నగరి బరిలో రోజాపై పోటీ చేసేందుకు అనుష్క శెట్టి రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. మరి ఏమవుతుందో మరి కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. కాగా హీరోయిన్ అనుష్క శెట్టి… ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. మొన్న మిస్ సెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో మెరిసింది. మళ్లీ సినిమాలు చేయడంలో కాస్త లేట్ చేస్తోంది అనుష్క శెట్టి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు