Exercise Tips : వ్యాయామం చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు

Exercise Tips : రెగ్యులర్ గా వ్యాయామం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయమం చేసేవారు, అథ్లెట్లు కచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లేదంటే వ్యాయామం చేసి కూడా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతమంది అధికంగా వ్యాయామం చేస్తూ ఉంటారు. దీనివల్ల కండరాలకు తగినంత ఆక్సిజన్ అందక తిమ్మిర్లు వస్తాయి. ఈ సమస్య ఎక్కువగా పాదాలలో కనిపిస్తుంది. కండరాలు కార్బోహైడ్రేట్ల నుంచి అవసరమైన ఆక్సిజన్ ను అందుకుంటాయి. తగినంత ఆక్సిజన్ ఉన్నప్పుడు వ్యాయామం చేయడం సులభతరం అవుతుంది. కానీ ఆక్సిజన్ స్థాయిలు తక్కువైనప్పుడు పైరువేట్ లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. దీంతో శరీరం లాక్టిక్ యాసిడ్ ను స్రవిస్తుంది. ఇది పెరిగితే శరీరంలోని కణాల యాసిడ్ స్థాయి కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దీంతో జీవక్రియలు డిస్టర్బ్ అవుతాయి. తిమ్మిరి, అలసట, చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి అతిగా వ్యాయామం చేయడం వల్ల లాక్టిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయంలోకి వెళ్తే…

1. శిక్షకులు ఉండాల్సిందే…

అధిక వ్యాయామం ( Exercise Tips ) చేస్తూ, అధిక బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు ఆక్సిజన్ కావాలి. కాబట్టి ట్రైనర్ లేకుండా సొంతంగా ఎలాంటి స్టంట్లు చేయకూడదు. ట్రైనర్లు ఉంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా ఎలా వ్యాయామం చేయాలో సూచిస్తారు.

2. నొప్పితో జాగ్రత్త

సుదీర్ఘ వ్యాయమం తరువాత ఒళ్ళు నొప్పులు రావడం కామన్. కాబట్టి విశ్రాంతి తీసుకోండి. బాగా ఊపిరి పీల్చుకోండి. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి పెరగడం వల్ల లాక్టిక్ ఆమ్లాన్ని పెంచదు. నొప్పి వచ్చినప్పుడు బామ్ తో సున్నితంగా మసాజ్ చేయండి. తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించండి. నొప్పి తగ్గితే తరువాత కామన్ గానే వ్యాయామం చేయొచ్చు.

- Advertisement -

3. ఆహారం

మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గుమ్మడి గింజలు, బీన్స్, బచ్చలి కూర వంటివి ఎక్కువగా తినండి. మెగ్నీషియం బాగా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. తృణ ధాన్యాలు శక్తిని పెంచుతాయి.

4. ప్రొటీన్లు

ధాన్యాలు, ఆకుపచ్చ కూరలు, పాల ఉత్పత్తులు, బఠాణీలు, చేపలు, గుడ్లు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే విటమిన్ B3 శరీరానికి గ్లూకోజ్ అందిస్తుంది.

5. యాంటీ ఆక్సిడెంట్లు

బెర్రీలు, గింజలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండే ఫుడ్ తింటే లాక్టిక్ యాసిడ్ ఏర్పడకుండా ఉంటుంది.

6. నీరు

రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోతుంది. వ్యాయామం చేసే వాళ్లు హైడ్రేటెడ్ గా ఉండాలి. వ్యాయామం చేయడానికి ముందు వామప్ చేయడం ముఖ్యమని గుర్తు పెట్టుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు