Fools Day : ఏప్రిల్ 1న ఎందుకు ఫూల్స్ ను చేసుకుంటారో తెలుసా?

Fools Day : ఈరోజు ఏప్రిల్ 1… ఎక్కడ చూసినా జనాలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చెప్పి ఫూల్స్ చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. ఇళ్ల నుంచి మొదలుకొని స్కూల్లు, ఆఫీసులు ఇలా ప్రతి చోటా ఫూల్స్ డేను సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ పూల్స్ డేను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఫూల్స్ డే చరిత్ర ఏంటి? భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏప్రిల్ 1నే ఫుడ్స్ డే ఎందుకు?

ఏప్రిల్ 1నఫూల్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయం ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరికీ తెలీదు. కానీ ఏప్రిల్ 1న ప్రాచీన రోమన్లు హిలేరియా అనే ఒక వేడుకను సెలబ్రేట్ చేసుకునేవారు. ఏప్రిల్ 1 అనేది సైబెల్ అనే ప్రకృతి, సంతానోత్పత్తికి సంబంధించిన ఒక ఫిజియన్ దేవతను పూజించుకోవడానికి ప్రత్యేకమైన రోజుగా భావించేవారు. ఈ దేవతకు ముడిపడి ఉన్న కథనాల్లో భాగంగానే ఫూల్స్ డే పుట్టిందని అంటారు. హిలేరియా అనే పదానికి అర్థం ఉల్లాసంగా లేదా ఆనందంగా జీవించడం. ఈ పండగ రోజున ఒకరినొకరు ఫూల్స్ చేసుకుంటూ సరదాగా గడిపేవారు. ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఏప్రిల్ 1ని ఫూల్స్ డేగా సెలెబ్రేట్ చేసుకుంటారు.

ఏప్రిల్ లోనే ఎందుకు ఫూల్స్ డే?

ఏప్రిల్ లోనే ఎందుకు ఫూల్స్ డే? అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఏప్రిల్ లో ఫూల్స్ డే ( Fools Day ) జరుపుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. 16వ శతాబ్దంలో ప్రాన్స్ లో ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. అయితే 1582లో ఫ్రెంచ్ రాజు జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ చాలామంది ప్రజలు ఈ మార్పును అంగీకరించలేదు. అందుకే ఎప్పటిలాగే ఏప్రిల్ 1నే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కొనసాగించారు. దీంతో రాజు పెట్టిన రూల్ ను పక్కన పెట్టి అలా ఏప్రిల్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వాళ్లను అప్పట్లో ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారట. ఈ విధంగా ఏప్రిల్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1 అనేది ఫూల్స్ డేగా మారిపోయింది.

- Advertisement -

భారతదేశంలో ఏప్రిల్ ఫూల్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే?

భారతదేశంలో ఏప్రిల్ 1న ఫూల్స్ డే జరుపుకోవడం అనేది 19వ శతాబ్దంలో ప్రారంభమైందని నమ్ముతారు. ఎందుకంటే ఆ సమయంలో బ్రిటిష్ వారు ఇండియాను పరిపాలించారు. వాళ్లే ఇక్కడ తమ సంస్కృతిని కూడా విస్తరించారు కాబట్టి ఆ సాంప్రదాయాలలో ఏప్రిల్ ఫూల్స్ డే కూడా ఒకటి అని అంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏప్రిల్ 1న ఫూల్స్ డేగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు