Tillu Square Collections : రూ.100 కోట్లు టార్గెట్… 3 రోజుల్లో ఎంతంటే..?

Tillu Square Collections : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి కోట్లు కొల్లగొడుతూ రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఏమాత్రం అంచనాలు లేకుండా అతి చిన్న సినిమాగా వచ్చి డీజే టిల్లు అంటూ ఒక సెన్సేషన్ సృష్టించారు. సిద్దు జొన్నలగడ్డ అందులో ఉన్న కామెడీ టైమింగ్ , క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కంటెంట్ ని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా.. అయితే ఇప్పుడు తాజాగా దీనికి సీక్వెల్ గా రూపొందించిన టిల్లు స్క్వేర్ మార్చి 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొక రికార్డు క్రియేట్ చేయబోతోంది.

మొదటి సినిమా చేసిన ఇంపాక్ట్ తో రెండవ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అంతేకాదు ప్రేక్షకుల అంచనాలను డిసప్పాయింట్ చేయకుండా వారు ఊహించిన దాని కంటే ఎక్కువ కంటెంట్ తోనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి మల్లిక రామ్ దర్శకత్వం వహించగా.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్, సీతారాం ఎంటర్ప్రైజెస్ పతాకాలపై సాయి సౌజన్య సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇక భారీ అంచనాల మధ్య రూ.100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వసూలు చేసింది..

రూ.100 కోట్ల దిశగా

మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు గంటల పాటు నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తోంది అని చెప్పవచ్చు.. విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.23.7 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు రూ.45.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక మూడు రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా టిల్లు స్క్వేర్ సినిమా రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ( Tillu Square Collections ) వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో అతి త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరబోతున్నారు సిద్దు జొన్నలగడ్డ.

- Advertisement -

రాధిక పాత్రలో అనుపమ..

ఇందులో రాధిక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ తన అద్భుతమైన నటనతో మరొకసారి మాయ చేసింది.. అప్పటివరకు సాంప్రదాయబద్ధంగా కనిపించి అందరిని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇందులో ఒక్కసారిగా బోల్డ్ కంటెంట్తో ఆశ్చర్యపరిచింది.. అంతేకాదు ఇందులో బోల్డ్ గా నటించినప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ తన నటనతో అలరించిన ఈమెకు ఈ సినిమా ద్వారా మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. ఇక సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో మరొకసారి తన మేనరిజం చూపించారు.. మొత్తానికి అయితే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు అతి తక్కువ సమయంలోనే రూ .100 కోట్ల క్లబ్లో చేరిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు