Actress Gautami : హీరోయిన్ గౌతమీ కూతుర్ని చూశారా.. ఎంత అందంగా ఉందో..?

Actress Gautami : నాటి నుంచి నేటి వరకు చాలా మంది సెలబ్రిటీలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా తమ వారసులను పరిచయం చేస్తే మరి కొంతమంది తమ పిల్లలు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతమి కూడా తన కూతుర్ని త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోంది.ఇక ఈమెను చూస్తే మాత్రం ఇంత పెద్ద కూతురు గౌతమికి ఉందా అంటూ అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అమ్మాయి చూడడానికి ఎంత అందంగా ఉందంటే ఆ ఫోటోలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. త్వరలోనే గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఇండస్ట్రీ లోకి రాబోతుందని సమాచారం..

గౌతమి సినిమాలు..

తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసిన ఈమె.. అందులో బజారు రౌడీ , తోడళ్లుళ్ళు, ఆగస్టు 15 రాత్రి, కృష్ణ గారి అబ్బాయి, ప్రచండ భారతం, చైతన్య, డియర్ బ్రదర్, బామ్మ మాట బంగారు బాట, అగ్గి రాముడు , అన్న తమ్ముడు వంటి తెలుగు సినిమాలలో నటించారు.ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాలో చికుబుకు రైలే అనే పాటలో ఐటెం సాంగ్ లో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నారు ఈ ముద్దుగుమ్మ..

గౌతమి వ్యక్తిగత జీవితం..

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో టిఆర్ శేషగిరిరావు, వసుంధర దేవి దంపతులకు జన్మించింది గౌతమి ( Actress Gautami ) . ఈమె తండ్రి ఆంకాలజిస్ట్ కాగా తల్లి పాథాలజిస్ట్.. బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదువుకున్న గౌతమి.. చివరికి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో తన విద్యను పూర్తి చేసింది. 1998 జూన్ 4న చెన్నైలోని సందీప్ భాటియా అనే వ్యాపార వ్యక్తిని వివాహం చేసుకుంది.. ఈ దంపతులకు పుట్టిన కూతురే సుబ్బలక్ష్మి.. 1999లో కూతురు సుబ్బలక్ష్మి జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.. ఇక 2004 నుండి 2016 వరకు నటుడు కమలహాసన్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన ఈమె అతనితో తన సంబంధాన్ని ముగించుకున్నట్లు తన బ్లాక్ ద్వారా ప్రకటించింది. నేను మిస్టర్ హాసన్ ఇకపై కలిసి లేము అని చెప్పడానికి ఈ రోజు నాకు హృదయం దుఃఖంతో పొంగిపోతోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత వినాశకరమైన నిర్ణయాలలో ఇది ఒకటి అంటూ గౌతమి తన బ్లాగ్ లో రాసుకుంది..

- Advertisement -

క్యాన్సర్ తో పోరాడి..

అయితే 35 సంవత్సరాల వయసులో రొమ్ము క్యాన్సర్ తో బాధపడిన ఈమె చాలా కాలం క్యాన్సర్ తో పోరాడి చివరికి క్యాన్సర్ నుండి కోలుకొని మామూలు మనిషి అయింది. ఇక రాజకీయాల్లో కూడా ప్రవేశించింది గౌతమి 1997లో బిజెపిలో చేరిన ఈమె 2023 అక్టోబర్ 23న ఆ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ఏఐడీఎంకే పార్టీలో చేరింది.

 

View this post on Instagram

 

A post shared by Gautami Tadimalla (@gautamitads)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు