Rajamouli : స్టేజ్ పై భార్యతో స్టెప్స్.. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ గా..!

Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు గా పేరుపొందిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి SSMB -29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు ఒకపక్క ఈ పనులు చేస్తూనే మరొక పక్క ఖాళీ సమయం దొరకగానే ఎక్కువగా కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికే ఇష్టపడుతున్నారు.. ఇటీవలే జపాన్ కి వెళ్లి అక్కడ అభిమానులతో కలిసి రాజమౌళి కుటుంబం RRR సినిమా రీ రిలీజ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.. తాజాగా రాజమౌళి భార్య రమాతో కలిసి స్టేజ్ పైన డాన్స్ వేసి అందరి చేత వావ్ అనిపించుకున్నారు.

భార్య రమా తో రాజమౌళి స్టెప్స్ అదుర్స్..

రాజమౌళి , రమా ఇద్దరు కలిసి స్టేజి పైన..” అందమైన ప్రేమ రాణి”.. అనే పాటకు డాన్స్ వేయగా..దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో ఏదో ఒక ఈవెంట్ కు సంబంధించిన వీడియో అన్నట్టుగా కనిపిస్తోంది.ఈ వీడియోలో మాత్రం రాజమౌళి డాన్స్ అద్భుతంగా చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇది చూసిన నెటిజెన్స్ సైతం ఒకసారిగా ఈ వీడియోని షేర్ చేస్తూ రాజమౌళి ఈజ్ ఏ డైరెక్టర్ ఆల్సో.. డాన్సర్ ఆల్సో అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..

రాజమౌళి సినిమాలు..

విభిన్నమైన డైరెక్షన్ తో ప్రేక్షకులను మెప్పించే రాజమౌళి (Rajamouli ) ఒక్కో సినిమాకు నాలుగైదు సంవత్సరాలు సమయం తీసుకుంటారనడంలో సందేహం లేదు. అందుకే అంత సమయం తీసుకుంటారు కాబట్టే ప్రతి పాత్రను శిల్పి చెక్కినట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఆయన సినిమాలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాయి.. ఇటీవలే రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాదు ఆస్కార్ వరకు వెళ్ళింది ఈ సినిమా.. పైగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది దీంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోందని చెప్పవచ్చు.

- Advertisement -

ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని దింపుతున్నారు రాజమౌళి. ఇండియానా జోన్స్ , రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్ లో ఈ సినిమా ఉండబోతుందట.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ విజువలైజేషన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు అంట రాజమౌళి.. రాజమౌళి దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా.. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహించిన పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు కూడా పోషించారు..ఇప్పుడు డాన్స్ కూడా చేసేసరికి అభిమానులు తమ అభిమాన డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు