Puri Jagannath : పూరీ తమ్ముడు రాయలసీమ అల్లుడా..?

Puri Jagannath : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చి వారికంటూ ఒక స్థానాన్ని అందించారు. అయితే ఇప్పుడు సరైన సక్సెస్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈయన తమ్ముడికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

పూరీ జగన్నాథ్ తమ్ముడు నటుడు సాయిరాం శంకర్ అందరికీ పరిచయమే. తమ్ముడిని పెద్ద స్టార్ చేయాలని పూరీ జగన్నాథ్ ఎంతో ప్రయత్నించారు.. కానీ తాను అనుకున్న రేంజ్ లో సాయిరామ్ శంకర్ సక్సెస్ కాలేదు..అలాగని సినిమాలకి కూడా దూరం కాలేదు.. తన టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.. బంపర్ ఆఫర్ లాంటి సినిమా సాయిరాం శంకర్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.. ఈ సినిమాతో అందరికీ రీచ్ అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు.. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇటీవల వెయ్ దరువెయ్ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మీడియాతో సాయిరాం శంకర్..

ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతున్న ఆయనకు పలు రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఇప్పటివరకు పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.. ఆయన భార్య లావణ్య, పిల్లలు ఆకాష్ అలాగే ఆయన కూతురు పవిత్ర కనిపిస్తూనే ఉంటారు.. మీ కుటుంబం ఎప్పుడు మీడియా ముందుకు రారు.. అసలు ఈయనకు పెళ్లయిందా అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరికొంతమంది పెళ్లి అయ్యింది.. పిల్లలు ఎంతమందో అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.. అసలు సంగతేమిటంటే సాయిరాంకి ఇద్దరు ఆడపిల్లలు.. వాళ్ళు చదువుకుంటున్నారు.. ఇతడిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిరిచిన వివాహమా అన్నది తెలియదు కానీ రాయలసీమ అనంతపురం అల్లుడని మాత్రం తెలుస్తోంది..

- Advertisement -

అనంతపురం అల్లుడుగా సాయిరాం శంకర్..

అనంతపురం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు పనిగట్టుకొని అడిగితే చెప్పాడు.. లేదంటే ఈ విషయాలు ఎప్పటికీ మీడియాకి దూరంగానే ఉంచేవాడేమో.అయితే ఇక తాను అనంతపురం అల్లుడిని అని చెప్పుకోవడానికి కూడా అసౌకర్యంగా గురైనట్లు కనిపించాడు. ఇండస్ట్రీలో తనకు అన్నల సహకారం ఎంతో ఉందని.. ఇప్పటికీ ఉందని కూడా తెలిపారు.. తన అన్నయ్య ఒకరు డైరెక్టర్ అయితే మరొకరు ఎమ్మెల్యే అని.. ఇద్దరు సహకారం తనకు ఉందని చెప్పుకొచ్చారు.. ఇకపోతే పెద్ద పెద్ద స్టార్స్ తో తనకు పెద్దగా స్నేహాలు లేవు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయని.. వాళ్లతోనే రెగ్యులర్ గా కలిసి ఉంటాను అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు సాయిరాం శంకర్. సాయిరాం శంకర్ అనంతపురం అల్లుడు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు