Prashanth Varma : సౌత్ ఇండియా ఆ స్టార్లనే అవమానించాడా…?

Prashanth Varma : టాలీవుడ్ లో ఈ ఇయర్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా “హనుమాన్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫాంటసీ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పెద్ద సినిమాలకు ధీటుగా ఆడిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అవడమే గాక, 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు రెండో పార్ట్ గా జై హనుమాన్ కూడా వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిన హనుమాన్ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మార్కెటింగ్ పరంగా ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడని చెప్పాలి. పైగా ఎప్పుడో ఏడాది కిందే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పలు పెద్ద సినిమాల వల్ల వాయిదా పడుతూ ఫైనల్ గా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయ్యాక కూడా థియేటర్ల సమస్య తెచ్చుకున్నా ఫైనల్ గా ప్రేక్షకుల ఆదరణతో హనుమాన్ బాక్స్ ఆఫీస్ పై విజయకేతనం ఎగరేసింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు ప్రశాంత్ వర్మ అన్ని రకాలుగానూ తన మార్కెటింగ్ తెలివితేటలను వాడడం జరిగింది. మూవీ లవర్స్ తో పాటు ఆయా స్టార్ హీరోల సపోర్ట్ కోసం హనుమాన్ మేకర్స్ చక్కగా మార్కెటింగ్ చేసారు. రిలీజ్ టైం లో హనుమాన్ మూవీ లో ఈ స్టార్ హీరో ఉంటే ఎలా ఉంటుంది అని అందరి ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పంపిస్తే ఎంచక్కా ఆ ట్వీట్లకు కామెంట్స్ చేస్తూ ప్రశాంత్ వర్మ తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు. ఇలాంటి ప్రమోషన్స్ రిలీజ్ అయ్యాక బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయి అంతా పూర్తయ్యాక కూడా ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ లోనే ఉండిపోయాడని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఫ్యాన్స్ వేసే పలు మీమ్స్ తో అప్పుడప్పుడూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో ప్రశాంత్ పెట్టిన ఓ స్టేటస్ మాత్రం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సరదాకైనా టూమచ్ !

హనుమాన్ మూవీ కి సంబంధించి ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఇంస్టాగ్రామ్ లో ఓ స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ స్టేటస్ లో ప్రశాంత్ వర్మ బిగ్గెస్ట్ ట్రియో పేరిట వచ్చిన ఓ మీమ్ ని స్టేటస్ గా పెట్టాడు. ఆ స్టేటస్ లో కోలీవుడ్ బిగ్గెస్ట్ ట్రియో జైలర్ లో రజిని, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అని పెట్టగా, తెలుగులో బిగ్గెస్ట్ ట్రియో వీళ్ళే అంటూ హనుమాన్ లో నటించిన కమెడియన్ల ఫోటోలు పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్ట్ సరదాకి పెట్టినా లెజెండరీ నటులతో ట్రోల్ అయిన కమెడియన్లకి పోలిక ఏంటి అని ఆ హీరోల ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నిజానికి అది ప్రశాంత్ వర్మ చేయకపోయినా, ఇలాంటి స్టేటస్ అలోచించి పెట్టాల్సింది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకులు ఇలాంటివి సరదాకే పెట్టారు తప్ప, ఎవర్ని తగ్గించాలని కాదని అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా హనుమాన్ కి రెండో పార్ట్ గా జై హనుమాన్ తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ 9న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

Did Prashanth Varma insult those senior stars?
Did Prashanth Varma insult those senior stars?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు