Hanuman on OTT : మూడు ఓటీటీల్లో “హనుమాన్”… ఎదురు దెబ్బ తప్పదా?

Hanuman on OTT : థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ విషయంలో మాత్రం వరుసగా ట్విస్టులు ఇస్తూనే ఉంది. ముందుగా హనుమాన్ మూవీ హిందీ వెర్షన్ జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది తెలుగు మూవీ, కానీ హిందీ స్ట్రీమింగ్ ముందుగా స్టార్ట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ నెక్స్ట్ డే అంటే మార్చ్ 17న జి5 అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో హనుమాన్ తెలుగు వర్షన్ ను స్ట్రీమింగ్ చేశారు. అయితే ఇంకా తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కోసం ఆయా భాషల ప్రేక్షకులకు ఎదురు చూపులు తప్పడం లేదు. అయితే ఈ భాషల్లో మాత్రం మరో ఓటిటి ప్లాట్ ఫామ్ లో హనుమాన్ ( Hanuman on OTT )మూవీ అందుబాటులోకి రాబోతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హనుమాన్ మూవీ తమిళ, మలయాల, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే హిందీ, తెలుగులో వేరు వేరు ఓటిటీ ప్లాట్ ఫామ్ ల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఈ మూడు భాషల్లో మాత్రం ఏప్రిల్ 5న హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. కానీ ఈ స్ట్రాటజీనే ఇప్పుడు నిండా ముంచేసేలా కనిపిస్తోంది.?

మూడు ఓటిటిలో రిలీజ్ అయితే ఇదే నష్టం… సాధారణంగా ఒక సినిమా మూడు వేర్వేరు ఓటిటిలో రిలీజ్ కావడం అన్నది అరుదు. పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ దాదాపుగా ఒకటి లేదా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కానీ హనుమాన్ విషయంలో మాత్రం ఏకంగా మూడు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంతకీ దీనివల్ల నష్టం ఏంటి? అంటే… సాధారణంగా సినిమాలను ఒకే ప్లాట్ ఫామ్ లో అన్ని భాషల్లో సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి తీసుకొస్తారు. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకే ఓటిటి ప్లాట్ఫారంలో నచ్చిన భాషలో క్లారిటీతో సినిమాను చూస్తారు. ఇతర భాషల్లో చూడాలంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని హ్యాపీగా చూసేస్తారు. ఇలా ఒక్కో భాషకు ఒక్కో ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేయడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవుతారు.

హిందీ వెర్షన్ చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ జియో సినిమా సబ్స్క్రైబర్లు కారు. అలాగే ఇది మిగతా భాషలకు కూడా వర్తిస్తుంది. ఒక్క సినిమా కోసం ప్రతి ఓటిటి ప్లాట్ ఫామ్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం కంటే ఫ్రీగా పైరేటెడ్ వర్షన్ చూస్తే బెటర్ అని అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు కొన్ని సైట్లలో పైరసీ కూడా ఫుల్ క్లారిటీతో వచ్చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి కొంతమంది మాత్రం అంతగా పాపులర్ కానీ ఇతర ఓటిటి ప్లాట్ ఫామ్ లో మూవీ అందుబాటులో ఉంటే దాన్ని చూడడం పూర్తిగా మానేస్తారు. ఇక దీనివల్ల లాభం ఏంటంటే అర్థం చేసుకునే భాషలో తమకు ఇష్టమైన సినిమాను చూడొచ్చని అనుకుంటే ఆ ఓటిటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కానీ ఇదంతగా వర్క్ అవుట్ అయ్యే పని కాదు. సబ్స్క్రైబర్లను అట్రాక్ట్ చేసి తమ పరిధిని విస్తరించుకోవచ్చు అని అనుకున్న ఓటీటీలకు దీనివల్ల పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది.

- Advertisement -

“సలార్” సీన్ రిపీట్…

హనుమాన్ మూవీకి కూడా సలార్ పరిస్థితి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ రెండు ఓటిటిలలో అందుబాటులోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో మిగతా భాషల్లో, హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఒక్క భాషలో మిస్ కావడం వల్ల నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ జాబితా నుండి సలార్ పడిపోయింది. హిందీ వెర్షన్ కోసం సపరేట్ గా హాట్ స్టార్ సబ్స్ట్రిప్షన్ తీసుకోవడం కంటే పైరేటెడ్ వర్షన్ ను చూడడానికే ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది. ఈ పరిస్థితిని చూశాక మేకర్స్ తమ మూవీని ఒకే ఓటిటీకి అమ్మితే బెటర్ అన్పిస్తోంది. అప్పుడే పాన్ ఇండియా ఆడియన్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఒకేచోట మూవీని చూడగలుగుతారు. అలాగే మంచి సినిమాల రైట్స్ దక్కించుకున్న ఓటిటిలకు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు