Hanuman OTT : “హనుమాన్”పై నెగెటివ్ టాక్… జీ5 ఫెయిల్యూరే కారణమా?

మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ ఎట్టకేలకు ఓటిటిలోకి వచ్చేసింది. థియేటర్లలో యునానిమస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి ఓటిటిలో మాత్రం తీవ్రమైన నెగిటివ్ టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ ఆ నెగిటివ్ టాక్ కు కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

“హనుమాన్”పై నెగెటివ్ టాక్…
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన హనుమాన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచింది. 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. ఇక ఈ మూవీ ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చిన జీ5 ఎట్టకేలకు మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ మొదలు పెట్టింది. ఇక తెలుగు వర్షన్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా హనుమాన్ పై అనూహ్యమైన రీతిలో నెగిటివ్ టాక్ నడుస్తోంది. సినిమాలో చివరి 10 నిమిషాలు అంటే క్లైమాక్స్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటున్నారు. దీనికంటే గుంటూరు కారం మూవీనే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ ఫ్యాన్స్ పనేనా ఇది?
ముఖ్యంగా ఈ నెగిటివ్ టాక్ కు మహేష్ బాబు ఫ్యాన్స్ కారణమని టాక్ నడుస్తోంది. సంక్రాంతి రిలీజ్ విషయంలో హనుమాన్, గుంటూరు కారం మూవీ మధ్య క్లాష్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా గుంటూరు కారం మూవీకి నెగిటివ్ టాక్, చిన్న సినిమా అంటూ హనుమాన్ కు సింపతి దక్కాయి. ఇప్పుడు దాన్నే మనసులో పెట్టుకొని మహేష్ ఫ్యాన్స్ హనుమాన్ మూవీకి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతోపాటు హనుమాన్ ఓటిటి వెర్షన్ పై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

జీ5 ఫెయిల్యూర్ కారణమా?
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో కూడా అదే రేంజ్ బజ్ తో స్ట్రిమింగ్ అవుతాయి. ప్లాప్ సినిమాలు మాత్రం పెద్దగా ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతాయి. కానీ హనుమాన్ మూవీ విషయంలో మాత్రం జీ5 తీరు విచిత్రంగా అనిపిస్తుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీకి ఎలాంటి హైప్ లేదా అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. నిజానికి ఓటిటీ వీక్షకులు హనుమాన్ స్ట్రీమింగ్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. ఆ అంచనాలను ఉపయోగించుకోవడంలో జీ5 పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీని ఉపయోగించుకొని అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి బిగ్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు పోటీ ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని జీ5 కోల్పోయింది. ఇక తాజాగా మూవీకి నెగిటివ్ టాక్ రావడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.

క్వాలిటీ ఇష్యూ కూడా…
వాస్తవానికి హనుమాన్ మూవీ ఓటిటి వెర్షన్ స్ట్రీమింగ్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. శివరాత్రి కానుకగా ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తారని అనుకున్నారు. అది నిరాశే అయింది. ఇక ఒకానొక సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓపిక పట్టమని కోరుతూ హనుమాన్ రాక ఆలస్యం కావడం గురించి ట్విట్ చేశాడు. కానీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన హనుమాన్ ను తీరా చూస్తే అసంతృప్తే మిగిలింది ప్రేక్షకులకు. ముఖ్యంగా పిక్చర్ కు సౌండ్ కు సింక్ కుదరలేదని, సౌండ్ వరస్ట్ గా ఉందని, పూర్ క్వాలిటీ అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇంతకాలం ఈ మూవీ గురించి వెయిట్ చేయించడం కూడా మూవీపై ఇంట్రెస్ట్ దొబ్బేలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో తన స్టామినాను పెంచుకునే అద్భుతమైన అవకాశాన్ని జీ5 చేజార్చుకుందనే చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు