Shankar : మూడు పడవలపై ప్రయాణం… డైరెక్టర్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే

Shankar : ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం ప్రమాదకరం అనే మాట గుర్తుకు వస్తోంది డైరెక్టర్ శంకర్ ను చూస్తే. కానీ ఆయన రెండు పడవల మీద కాదు మూడు పడవల మీద ఒకేసారి కాలు వేసి మరీ రిస్క్ వైపు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో పడవ మునుగుతుందా తేలుతుందా అనేది పక్కన పెడితే ఆయన ఓ తప్పు మాత్రం చేస్తున్నారు. ఇంతకీ శంకర్ చేస్తున్న ఆ తప్పేంటి? అంటే…

బిగ్ రిస్క్…

ప్రస్తుతం శంకర్ ( Shankar ) ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్స్ తెరపైకి త్వరలోనే రాబోతున్నాయి. భారతీయుడు 2, భారతీయుడు 3 మూవీ షూటింగ్ పూర్తి అయినట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ బయట పెట్టారు. మరోవైపు అదే సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో “గేమ్ చేంజర్” అనే సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అంటే ఒకేసారి మూడు సినిమాలు చేయడంలో శంకర్ నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అక్కడిదాకా బాగానే ఉంది గాని ఈ మూడు సినిమాలు కూడా పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కావడం గమనార్హం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు ఒకప్పుడు బాగానే వర్కౌట్ అయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి సినిమాల సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లేతో కథనం ఇంట్రెస్టింగ్ గా కొనసాగితే తప్ప ఈ జానర్ సినిమాలు పెద్ద ఎఫెక్టివ్ గా ఉండవు.

ఇలాంటి టైంలో శంకర్ సోషల్ మెసేజ్, పొలిటికల్ డ్రామా అంటూ ఒకే జానర్ కి చెందిన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీటిలో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుత తరం ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా శంకర్ టేకింగ్ ఉంటుందా లేదా? అనేది మరో పెద్ద ప్రశ్న. శంకర్ గత చిత్రం రోబో 2.0 పెద్దగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా భారతీయుడు 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ పై కూడా విమర్శలు వచ్చాయి. టీజర్ నేటి కాలానికి తగ్గట్టుగా లేదని, అవుట్ డేటెడ్ కంటెంట్ అంటూ ట్రోల్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఒకేసారి ఒకే జానర్ లో మూడు సినిమాలు చేయడం అంటే అంటే బిగ్ రిస్క్ అనే చెప్పొచ్చు. మరి ఈ రిస్క్ ని శంకర్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఉత్కంఠభరితంగా మారింది.

- Advertisement -

మూడు సినిమాల లేటెస్ట్ అప్డేట్…

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ప్రస్తుతం తాము ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలపై పని చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఈ రెండు సీక్వెల్స్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టామని కమల్ తెలిపారు. దీనికి తుది మెరుగులు దిద్దడం పూర్తయ్యాక ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెడతామని కమల్ హాసన్ వెల్లడించారు. ఇక మరోవైపు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కానుంది. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ “జరగండి”ని రిలీజ్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు