Kamal Haasan : కల్కి సినిమాలో తన పాత్రను రివీల్ చేసిన కమల్ హాసన్..!!

Kamal Haasan : పాన్ ఇండియా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలలో కల్కి 2898 AD సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే , దిశాపటాని నటిస్తున్నారు.. అలాగే ఈ సినిమాలో విలన్ గా కమలహాసన్ (Kamal Haasan)నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నది.

కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర..

ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తోనే మంచి హైప్ ఏర్పడింది.. కల్కి సినిమా మహాభారత ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించామంటూ గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు.. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కూడా నటించబోతున్నట్లు ఇటీవలే నిర్మాత స్వప్న దత్ కూడా వెల్లడించింది..

కమల్ హాసన్ పాత్ర అదేనా..?

ఇదంతా ఇలా ఉండగా కల్కి సినిమా విషయంలో అభిమానులకు కమలహాసన్ ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ న్యూస్ తెలియజేశారు..ముఖ్యంగా తను నటిస్తున్నటువంటి మూడు సినిమాల పైన కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.. కల్కి చిత్రంలో తను కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించబోతున్నానంటూ వివరించారు. అలాగే తన రోల్ షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని కూడా తెలిపారు. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే నిన్నటి వరకు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ అనే పవర్ఫుల్ పాత్రలో మాత్రమే చేస్తున్నారని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఉన్నట్టుండి తనది కేవలం అతిధి పాత్ర మాత్రమే అని చెప్పడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -

కమల్ హాసన్ పాత్ర పై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్..

ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఈ చిత్రంలో కమల్ హాసన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని కామెంట్స్ చేయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. కానీ డైరెక్టర్ మాత్రం కమల్ హాసన్ పాత్ర గెస్ట్ రోల్ అయినప్పటికీ కూడా తన పాత్ర కచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

కమల్ హాసన్ చిత్రాలు..

ఇప్పటికే కమల్ హాసన్ ఇండియన్-2 , ఇండియన్-3 సినిమా షూటింగ్ లను పూర్తి చేశామని తెలియజేశారు.
అయితే ఇండియన్-2 సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోందని వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే ఇండియన్-3 ప్రాజెక్టును కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేశారు కమలహాసన్.. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కమలహాసన్ ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నామని తెలియజేశారు. మొత్తానికైతే కల్కి సినిమాలో తను విలన్ కాదని అతిధి పాత్ర అంటూ తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి మే 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు