Alia Bhatt : ఆ రేర్ రికార్డ్ ఈమె సొంతం.. సూపర్ కదా..!

Alia Bhatt : ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆలియా భట్ ( Alia Bhatt ) ఏ రోజు కూడా తన తండ్రి ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. అంతే కాదు బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా సినీ ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకునే యాక్టర్స్ కి ఫిలింఫేర్ అవార్డులు అందిస్తూ ఉంటారు.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో అవార్డుల పండుగ మొదలైంది.. టైమ్స్ గ్రూప్ కి చెందిన ఫిలింఫేర్ మ్యాగజైన్ 1954 లోనే ఈ అవార్డులను ప్రారంభించింది..

69వ హ్యుందాయ్ ఫిలింఫేర్ అవార్డ్స్ సెర్మనీ 2024:

ప్రస్తుతం 69వ హ్యుందాయ్ ఫిలింఫేర్ అవార్డ్స్ సెర్మనీ 2024 జనవరి 28న గుజరాత్ లోని గాంధీ నగర్ లో GIFT సిటీలో ఈ వేడుక జరిగింది. 2023లో వచ్చిన సినిమాలలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం 30 విభాగాలలో పురస్కారాలు అందించగా.. అందులో ఉత్తమ నటిగా మరొకసారి ఆలియా భట్ అవార్డును సొంతం చేసుకుంది.. ఈ క్రమంలోనే బెస్ట్ యాక్టర్స్ గా ఎక్కువ ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్న నటిగా రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

ఉత్తమ నటిగా ఆలియా భట్..

ఇకపోతే ఆలియా భట్ ఇప్పటికే ఉత్తమ నటిగా 5 ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.. అలాగే ఇప్పుడు మరొకసారి బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది.. 2016లో విడుదలైన ఉడ్తా పంజాబ్ సినిమాకి ఉత్తమ నటిగా మొదటి ఫిలింఫేర్ అవార్డు లభించగా.. రెండు సంవత్సరాల తర్వాత 2018 లో వచ్చిన రాజీ సినిమాలో అద్భుతమైన నటనకు తనకు రెండో ఫిలింఫేర్ అవార్డు లభించింది. అలాగే ఆ తర్వాత ఏడాది అంటే 2019లో కూడా గల్లీ బాయ్స్ సినిమాకి బెస్ట్ హీరోయిన్గా ఫిలింఫేర్ వరించింది. ఇక 2022లో రిలీజ్ అయిన గంగుబాయి కతియావాడి సినిమాకి కూడా నాలుగవ సారి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇక 2023లో విడుదలైన రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని మూవీకి కూడా ఇదే అవార్డు లభించడం గమనార్హం.. ఇక వీటితోపాటు 2014లో విడుదలైన హైవే చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలిం క్రిటిక్స్ అవార్డుని సొంతం చేసుకుంది ఆలియా భట్..

- Advertisement -

వారి రికార్డులను సమం చేసిన ఆలియా భట్..

ఇకపోతే ఉత్తమ నటిగా ఐదుసార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బాలీవుడ్ హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు.. ఈ లిస్టులో నూతన్, కాజోల్ ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు వీరి రికార్డును అలియా భట్ ఈ ఏడాది సమం చేసిందని చెప్పవచ్చు..

అలియా భట్ సినిమాలు..

RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన ఆలియాభట్ ఇప్పుడు జిగ్రా సినిమాలో నటిస్తోంది. సెప్టెంబర్ 27న విడుదల అయ్యే ఈ సినిమాకి ఆలియా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం.. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, ఆలియా సొంత బ్యానర్ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు