Rajamouli : నేను నోరు విప్పితే.. సుకుమార్ కి హార్ట్ ఎటాకే..

Rajamouli : రామ్ చరణ్ తాజాగా మార్చి 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటుండడంతో మెగా అభిమానులంతా సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ నిన్న అదిరిపోయే అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ , సుకుమార్ కాంబోలో మరో సినిమా రాబోతుందంటూ తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రకటన చేశారు. RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇకపోతే ఇలా మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రంగస్థలం చిత్ర బృందం మొత్తం కలసి పని చేస్తుండడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. అయితే ఇలాంటి సమయంలోనే రాజమౌళి (Rajamouli) మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

RC 17 పై రాజమౌళి కామెంట్స్..

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై గతంలోనే డైరెక్టర్ రాజమౌళి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి RC 17 పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారింది. నా దగ్గర ఒక స్పాయిలర్ ఉంది.. సుకుమార్ – రామ్ చరణ్ చేయబోతున్న సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి నాకు తెలుసు.. అయితే అదేంటి అనేది నేను ఎలాగో చెప్పను.. ఎందుకంటే ఒకవేళ నేను నోరు విప్పితే సుకుమార్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది.. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను.. ఆ సీను మాత్రం హార్ట్ హిట్టింగ్ గా ఉంటుంది.. థియేటర్లలో ఆడియన్స్ వాళ్ళ సీట్లల్లో వాళ్ళు కూర్చోలేరు.. అంత పవర్ ఫుల్ గా ఆ సీన్ ఉంటుంది అంటూ రాజమౌళి తెలిపారు.. ఇప్పుడు ఈ వీడియో ను రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..

అంచనాలు పెంచిన రాజమౌళి..

RC 17 గురించి అప్డేట్ ఇవ్వడంతో అప్పుడే అంచనాలు పెంచేస్తున్నారు రాజమౌళి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ..మరి రాజమౌళినే అంతలా ఆకర్షించిన ఆ సీన్ ఏంటో చూడాలంటే వచ్చే ఏడాది ఎండింగ్ వరకు ఎదురు చూడాల్సిందే.. ప్రస్తుతం ఆర్సీ15 మూవీ పూర్తయిన వెంటనే ఆర్సి16 కూడా పూర్తి చేసి వచ్చే యేడాది చివరి కల్లా RC 17 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్..

- Advertisement -

RC -17 విశేషాలు..

సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.. ఇక ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుండగా.. ఈ సినిమా కాస్టింగ్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ RC 16 పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు