Surekha konidela : కొడుకు బర్త్ డే.. అలాంటి పని చేసిన సురేఖ..!

Surekha konidela : చిరంజీవి సతీమణిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సురేఖ కొణిదెల.. (Surekha konidela) ఇకపోతే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు కావడం నెలరోజుల ముందు నుంచే అభిమానులు రకరకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన పుట్టినరోజుని చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాంచరణ్ తల్లి సురేఖ కూడా ఈ ఏడాది అలాంటి పని చేయాలని.. ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.. దీంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

కొడుకు కోసం సురేఖ అలాంటి పని..

రామ్ చరణ్ తల్లి సురేఖ స్వయంగా 500 మందికి వంట చేసి అన్నదానం నిర్వహించారు.. రాంచరణ్ భార్య ఉపాసన తన అత్తమ్మ సురేఖ చేత అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ బిజినెస్ కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.. ముఖ్యంగా రామ్ చరణ్ పుట్టినరోజు కి ముందే అపోలో హాస్పిటల్స్ లో ఉన్న దేవాలయం యొక్క పుష్కరోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. సుమారు 500 మంది భక్తులు కూడా హాజరైన నేపథ్యంలో వారందరికీ సురేఖ తన స్వహస్తాలతో వండిన వంటలను తన కోడలు , ఉపాసన చేతులు మీదుగా వండింప చేసి దైవ కార్యక్రమానికి వచ్చిన వారందరి కడుపు నింపారు ఈ అత్తా కోడలు.. ఈ మేరకు ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సురేఖ ఇలాంటి పని చేసి అందరిని ఆశ్చర్యపరిచింది..

రామ్ చరణ్ మూవీ విశేషాలు..

ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి “జరగండి జరగండి” అనే పాట రిలీజ్ చేయబోతున్నారు. మరోవైపు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆర్సి 16 సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా లాంచనంగా ప్రారంభమయ్యాయి. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. దీంతోపాటు సుకుమార్ దర్శకత్వంలో RC 17 అనే సినిమాని కూడా ప్రకటించారు.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ సినిమా వచ్చే ఏడాది చివరి కల్లా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు సినిమా, సుకుమార్ సినిమాలకు సంబంధించిన ఏవైనా అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు