Vijay Devarakonda : అందుకే గౌతమ్ ను పక్కనపెట్టి, పరశురామ్ కి అవకాశం ఇచ్చాడు

Vijay Devarakonda : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ అన్నీ పట్టాలెక్కలేవు. కొన్ని సినిమాలు మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా త్వర త్వరగా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంటాయి. పోతే కొన్ని సినిమాలు పూజ జరిగిన తర్వాత కూడా ఆగిపోతుంటాయి. ఇంకొన్ని సినిమాలు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఆగిపోతాయి. ఇకపోతే విజయ్ దేవరకొండ అనౌన్స్ చేసిన చాలా ప్రాజెక్ట్స్ అలానే ఆగిపోయాయి. ఇకపోతే ఎవరు ఊహించని కాంబినేషన్ ఒకేసారి సెట్ కి కూడా వెళ్ళిపోయింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేశాడు విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. పూరి జగన్నాథ్ సినిమా హీరో క్యారెక్టర్రైజేషన్ కి విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ ఆటిట్యూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే అది బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి కొత్తదారి చూపిస్తుంది. అంటూ చాలామంది ఎన్నో అంచనాలను పెంచుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఇది అమ్మానాన్న తమిళ అమ్మాయి లాంటి సినిమాను మించి హిట్ అవుతుందని చాలామంది ఊహించారు. కానీ ఇవేవీ జరగలేదు.

ఇకపోతే ఈ సినిమా జరుగుతున్న టైం లోనే పూరి డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమాను కూడా విజయ్ దేవరకొండ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలానే ఆ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అయితే లైగర్ సినిమా ఫలితంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ విషయంలో తాను 200 కోట్లు నుంచే లెక్క పెట్టడం మొదలు పెడతానంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా మినిమం కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది.

- Advertisement -

ఇకపోతే జనగణమన ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. పూరి జగన్నాథ్ జనగణమన ప్రాజెక్టును పక్కనపెట్టి రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కించే పనిలో పడిపోయాడు. మరోవైపు గౌతమ్ సినిమాను చేయడానికి విజయ్ సిద్ధమైపోయాడు. కానీ పరశురాం తో సినిమాను సెట్ చేసుకొని ఇక రీసెంట్గా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమయ్యాడు.

పరశురాం సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేస్తారని అందరూ ఊహించారు కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. నాగచైతన్య కూడా పరశురాం తన టైం వేస్ట్ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ పరుశురాం కాంబినేషన్లో సినిమా గీత ఆర్ట్స్ లో జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ అది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో జరిగింది.

ఇకపోతే విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) గౌతమ్ తిన్ననూరి తో చేయబోయే సినిమా పెద్ద స్కేల్ లో ఉండబోతుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి చాలా టైం పడుతుందని, ఈలోపే పరుశురాం కంప్లీట్ స్క్రిప్ట్ తో తన దగ్గరికి రావడం వలన ఈ సినిమాను తాను చేయాల్సి వచ్చిందని, రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు